ప్రతీ ఒక్కరూ జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన వెంకటగిరి మున్సిపల్ కమిషనర్
జూన్ 21న యోగాంధ్ర
- ప్రతీ ఒక్కరూ జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన వెంకటగిరి మున్సిపల్ కమిషనర్
ఈ నెల 21న జరిగే యోగాంధ్ర కార్యక్రమంలో ప్రతీ ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని వెంకటగిరి మున్సిపల్ కమిషనర్ వెంకట రామిరెడ్డి పిలుపునిచ్చారు. పట్టణంలో నిర్వహించిన యోగాంధ్ర ర్యాలీలో ఆయన పాల్గొన్నారు.
తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో స్థానిక ఎంపీడీవో కార్యాలయం నుంచి పోలేరమ్మ ఆర్చి వరకు యోగాంధ్రా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అంగన్వాడీ సిబ్బంది, డ్వాక్రా సంఘాలు, పొదుపు మహిళలు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. పోలేరమ్మ ఆర్చి వద్ద మానవహారం నిర్వహించారు. యోగా వల్ల వచ్చే లాభాల గురించి మున్సిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డి వివరించారు. యోగా మానవ జీవితంలో అంతర్భాగమని, ప్రతి ఒక్కరూ యోగ తప్పనిసరిగా చేయాలని సూచించారు. ఈనెల 21న ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగే యోగేంద్ర కార్యక్రమానికి దాదాపుగా 12వేల మంది హాజరవుతారన్నారు. వెంకటగిరి ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ రామారావు, మున్సిపల్ సర్వే సుబ్రహ్మణ్యం, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.