జీవనశైలి వ్యాధులకు యోగానే పరిష్కారం

ఇన్చార్జి కలెక్టర్ కే కార్తీక్

నెల్లూరులో జిల్లా స్థాయి యోగా ర్యాలీని ప్రారంభించిన ఇన్చార్జికలెక్టర్

జీవనశైలి వ్యాధులకు యోగానే పరిష్కారం

  • ఇన్చార్జి కలెక్టర్ కే కార్తీక్
  • నెల్లూరులో జిల్లా స్థాయి యోగా ర్యాలీని ప్రారంభించిన ఇన్చార్జికలెక్టర్


నెల్లూరులో జిల్లా స్థాయి యోగా ర్యాలీని ఇన్చార్జి కలెక్టర్ కే కార్తీక్ జెండా ఊపి ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ యోగాను జీవనవిధానంలో భాగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.


యోగాంధ్ర కార్యక్రమాలను జిల్లాలోని చిట్టచివరి గ్రామానికి సైతం చేరే విధంగా అందరూ కృషి చేయాలని జిల్లా ఇంచార్జి కలెక్టర్ కార్తీక్ కోరారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా అన్ని వార్డు, గ్రామ సచివాలయ పరిధుల్లో యోగా ర్యాలీలు నిర్వహించారు. నగరంలోని ముత్తుకూరు సెంటర్ నుండి చిల్డ్రన్స్ పార్క్ వరకు జిల్లా స్థాయి యోగా ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా అధికారులు, మెప్మా మహిళలు, సచివాలయ సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు భారీగా హాజరై “ నిత్య యోగా శిక్షణ – సంపూర్ణ ఆరోగ్య రక్షణ, యోగా చేద్దాం – ఆరోగ్యంగా ఉందాం , యోగా చేద్దాం – ఒత్తిడిని జయిద్దాం , ఒత్తిడి లేని జీవన విధానం – యోగా తోనే సాధ్యం, ఆసనమే ఔషాదం ” వంటి నినాదాలతో కదం తొక్కారు. ఈ సందర్బంగా ఇంచార్జి కలెక్టర్ కార్తీక్ మాట్లాడారు. నేటి ఆధునిక ప్రపంచంలో జీవనశైలి వ్యాధులకు సరైన పరిష్కారం యోగాయని అన్నారు. ప్రతి ఒక్కరూ యోగాను జీవనవిధానంలో భాగం చేసుకోవాలన్నారు. ఈ ర్యాలీలో మున్సిపల్ కమిషనర్ నందన్, జడ్పీ సీఈవో విద్యారమ, ఆర్డబ్ల్యూఎస్, విద్యుత్ ఆర్ అండ్ బి, ఎస్ ఈలు వెంకటరమణ, విజయన్, గంగాధర్, డ్వామా పిడి గంగా భవాని, డి సి ఓ గురప్ప, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *