యోగాపై ప్రజలకు అవగాహన కల్పించిన అధికారులు
కోవూరులో యోగాంధ్ర ర్యాలీ…
- యోగాపై ప్రజలకు అవగాహన కల్పించిన అధికారులు
నెల్లూరు జిల్లా కోవూరు మండలంలో ప్రపంచ యోగ దినోత్సవం సందర్భంగా అధికారులు యోగా ర్యాలీ నిర్వహించారు. పంచాయతీ నుండి గ్రామంలో యోగాంద్ర ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ నిర్మాణానంద బాబా ఎంపీడీవో శ్రీహరి పాల్గొన్నారు. అనంతరం ఎంపీడీవో మాట్లాడుతూ… ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మండలంలోని ప్రతి సచివాలయం వద్ద ర్యాలీ నిర్వహించామని తెలిపారు. 21వ తేదీ యోగ దినోత్సవం సందర్భంగా మండలంలోని పెద్ద ఎత్తున యోగా కార్యక్రమం చేపట్టనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ విజయ, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు, ఆయుర్వేద వైద్యులు యుగంధర్, ఏఎన్ఎంలు పొదుపు మహిళలు పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు…