ఎమ్మెల్యే హెచ్చరించినా..

కోవూరులో రెచ్చిపోతున్న చికెన్ వేస్ట్ మాఫియా

గంగవరంలో కోళ్ల వ్యర్ధాల ట్రాక్టర్ ని సీజ్ చేసిన పోలీసులు

పెన్నానదిలో గుంత తవ్వి పూడ్చివేత_

ఫైల్ నేమ్ – కేవీఆర్ – చికెన్ వేస్ట్

ఎమ్మెల్యే హెచ్చరించినా….

  • కోవూరులో రెచ్చిపోతున్న చికెన్ వేస్ట్ మాఫియా
  • గంగవరంలో కోళ్ల వ్యర్ధాల ట్రాక్టర్ ని సీజ్ చేసిన పోలీసులు
  • పెన్నానదిలో గుంత తవ్వి పూడ్చివేత


సాక్షాత్తు ఎమ్మెల్యే వద్దని చెప్పినా…చికెన్ వేస్ట్ మాఫియా ఆగడాలు అడ్డూ అదుపు లేకుండా పోతున్నాయి. నిత్యం ఆ నియోజకర్గంలోని ఏదొక ప్రాంతంలో చికెన్ వ్యర్ధాలు తరలిస్తున్న వాహనాలు పట్టుపడుతూనే ఉన్నాయి. తాజాగా సోమవారం ట్రాక్టర్ లో తరలిస్తున్న చికెన్ వ్యర్ధాలను సీజ్ చేశారు.


ప్రశాంతమ్మ ఎంత వద్దంటున్నా… మమ్మల్ని ఎవడ్రా ఆపేది అంటూ…కోవూరు చికెన్ వేస్ట్ మాఫియా పెట్రేగిపోతుంది. నియోజకవర్గంలో కోళ్ల వ్యర్ధాలను భారీగా తరలిస్తూ పెద్ద మొత్తంలో సొమ్ము చేసుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అదేశాలతో…పోలీసులు, మత్స్యశాఖ అధికారులు ఎప్పటికప్పుడు దాడులు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే చెప్పినా… పోలీస్ అధికారులు చెప్పినా పట్టించుకోని చికెన్ వేస్ట్ మాఫియా వ్యర్ధాలను తరలిస్తూనే ఉన్నారు. తాజాగా సోమవారం కూడా గంగవరం పరిధిలో కోళ్ల వ్యర్ధాలు ఉన్న ఓ ట్రాక్టర్ ను సీజ్ చేసి స్టేషన్ తరలించారు. అనంతరం పోలీసులు, అధికారులు సమక్షంలో పెన్నా నదిలో గుంత తవ్వి పుడ్చివేశారు. ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి, ఎఫ్ డి ఓ శ్రీనివాసులు మాట్లాడుతూ.. నియోజకవర్గంలో చికెన్ వ్యర్ధాలను ఎవరు రవాణా చేసినా వారి మీద వారి వాహనాల మీద కేసులు పెడదామని హెచ్చరించారు. ఇప్పటికే 20 బండ్లు వరకు సీజ్ చేశామని తెలిపారు. ఈ విషయంలో ఎవరు ఏం చెప్పినా ఎమ్మెల్యే ఆదేశానుసారంగా పోలీసులు అధికారులు తగు చర్యలు తీసుకుంటామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *