తమను తీవ్ర ఇబ్బందులకి గురి చేస్తున్నాడు
అధికారులే న్యాయం చేయాలి
కలెక్టరేట్లో అధికారులకి వినతి పత్రం అందచేసిన మహిళలు
- తమను తీవ్ర ఇబ్బందులకి గురి చేస్తున్నాడు…
- అధికారులే న్యాయం చేయాలి
- కలెక్టరేట్లో అధికారులకి వినతి పత్రం అందచేసిన మహిళలు
కలువాయికి చెందిన రేవూరి యానాదయ్య తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడని…ఇదేమని ప్రశ్నిస్తే ఎస్సీ కేసులు పెడుతానని బెదిరిస్తున్నాడని…నెల్లూరు జిల్లా కలువాయికి చెందిన మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు నెల్లూరు కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అధికారికి వినతి పత్రం అందచేశారు. యానాదయ్య ఎస్సీ కాదని ఆరోపించారు. అసలు ఎస్సీనే కాని వ్యక్తికి ఎస్సీ సర్టిఫికేట్ ని అధికారులు జారీ చేయడం సరికాదన్నారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి తన ఎస్సీ సర్టిఫికేట్ చేయడంతోపాటు యానాదయ్యపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మహిళలు డిమాండ్ చేశారు. అనంతరం వారు ఎన్3న్యూస్ తో మాట్లాడారు.