కోవూరు ఎస్ఐకి వినతి పత్రం అందచేసిన టీడీపీ శ్రేణులు
వైసీపీ నేతల్ని కఠినంగా శిక్షించాలి
- కోవూరు ఎస్ఐకి వినతి పత్రం అందచేసిన టీడీపీ శ్రేణులు
మహిళల్ని అసభ్యకరంగా మాట్లాడిన వైసీపీ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోవూరు నియోజకవర్గ టీడీపీ మహిళామణులు, నాయకులు డిమాండ్ చేశారు. కోవూరు ఎస్ఐ రంగనాథ్ గౌడ్ కి వారు వినతి పత్రం అందచేశారు.
అమరావతికి భూములిచ్చిన మహిళల్ని వైసీపీ నేతలు అసభ్యకరంగా మాట్లాడడం దారుణమని…దీనిని తామంతా తీవ్రంగా ఖండిస్తున్నామని కోవూరు నియోజకవర్గ టీడీపీ మహిళామణులు, నాయకులు తెలిపారు. అసభ్యకరంగా మాట్లాడిన వైసీపీ నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ..వారు కోవూరు పోలీసుస్టేషన్ లో ఎస్ఐ రంగనాథ్ గౌడ్ కి వినతి పత్రం అందచేశారు. అనంతరం టిడిపి మండల అధ్యక్షుడు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. వేల ఎకరాలు అమరావతికి భూములు ఇచ్చిన మహిళామణులను అసభ్యకరంగా మాట్లాడడం సరికాదని వైసీపీ నేతలను హెచ్చరించారు. గతంలో నారా భువనేశ్వరిని అసభ్యకరంగా మాట్లాడినందుకు ప్రజలు ఓటు అనే రూపంలో నీకు తగిన గుణపాఠం చెప్పారని జగన్ కు తెలియజేశారు…ఈ కార్యక్రమంలో పెన్నా డెల్టా ఛైర్మన్ జెట్టి రాజగోపాల్ రెడ్డి, మాజీ టిడిపి మండల అధ్యక్షుడు ఇంతా మల్లారెడ్డి, ఎంపీటీసీ కొల్లారెడ్డి సునీల్ రెడ్డి, నాగరాజు, సర్పంచ్లు ఆమరావతి. విజయమ్మ. మహిళాలు వెంకట రమణమ్మ.ఉమ. నాయకులు బెజవాడ వంశీకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు…