శ్రీ లక్ష్మీ నారాయణ రైస్ మిల్లులో భారీగా రేషన్ బియ్యం గుర్తింపు
తనిఖీలు చేసిన ఆత్మకూరు సీఆర్డీటీ
నెల్లూరులో రెచ్చిపోతున్న PDS మాఫియా…
- శ్రీ లక్ష్మీ నారాయణ రైస్ మిల్లులో భారీగా రేషన్ బియ్యం గుర్తింపు
- తనిఖీలు చేసిన ఆత్మకూరు సీఆర్డీటీ
చంద్రశేఖరపురంలోని శ్రీ లక్ష్మీ నారాయణ రైస్ మిల్లులో భారీగా రేషన్ బియ్యాన్ని నిల్వ ఉంచినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఆత్మకూరు సీఆర్డీటీ రైసుమిల్లులో తనిఖీలు చేపట్టారు.
రాష్ట్ర ప్రభుత్వం…కలెక్టర్…సివిల్ సప్లయ్స్ డైరెక్టర్…అధికారులు హెచ్చరించినా…రేషన్ బియ్యం మాఫియాలో మాత్రం కొంచెం కూడా చలనం లేదనిపిస్తుంది ఈ సంఘటన చూస్తుంటే. చంద్రశేఖర్ పురంలోని శ్రీ లక్ష్మీ నారాయణ రైస్ మిల్లులో భారీగా రేషన్ బియ్యాన్ని నిల్వ చేసి ఉంచారు. రైస్ మిల్లు యాజమాన్యం…ఆ రేషన్ బియ్యాన్ని అంతా రీసైకిలింగ్ చేయిస్తోంది. ఈ విషయం తెలుసుకున్న స్థానిక గ్రామస్థులు రైసుమిల్లు యాజమాన్యం తిరగపడ్డారు. పోలీసుల సహకారంలో రైస్‌మిల్లు తాళాలు పగులగొట్టారు. వెంటనే వారు ఆత్మకూరు సీఆర్డీటీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన అక్కడకి చేరుకుని రీసైకిలింగ్ చేసిన బియ్యాన్ని లారీలలో లోడ్ చేస్తుండడాన్ని గుర్తించి అడ్డుకున్నారు. దాదాపు 5టన్నులకు పైగా రేషన్ బియ్యం రీసైకిలింగ్ చేస్తున్నట్లు సమాచారం.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ బియ్యాన్ని సివిల్ సప్లయ్స్ అధికారులకి పంపిస్తామన్నారు. అవి కానీ పీడీఎస్ బియ్యం అని నిర్ధారణ అయితే 6ఏ కేసు నమోదు చేస్తామని చెప్పారు. శ్రీ లక్ష్మీనారాయణ రైస్ మిల్ వ్యవహారంపై రెవెన్యూ, పౌరసరఫరాల, అధికారులు ఉదాసీగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. చూడాలి మరీ అధికారులు ఏ విధంగా స్పందిస్తారో…