కాకాణి కి ముగిసిన మూడురోజుల పోలీస్ కస్టడీ
మూడు రోజులపాటు విచారించినా.. నో ఆన్సర్..?
మరోసారి కష్టడీ కోరే అవకాశం..?
వైద్య పరీక్షల అనంతరం నెల్లూరు కేంద్ర కారాగారానికి తరలింపు_
తెలియదు..
నాకేం సంబంధం లేదు..!!
కాకాణి కి ముగిసిన మూడురోజుల పోలీస్ కస్టడీ
మూడు రోజులపాటు విచారించినా.. నో ఆన్సర్..?
మరోసారి కష్టడీ కోరే అవకాశం..?
వైద్య పరీక్షల అనంతరం నెల్లూరు కేంద్ర కారాగారానికి తరలింపు
నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం వరదాపురం వద్ద గల రుస్తుం మైన్ లో అక్రమ మైనింగ్ , పేలుడు పదార్థాలు కలిగి ఉండడం, గిరిజనులు ను బెదిరించారని కాకాణి పై ఎస్సీ ఎస్టీ కేసు నమోదైంది. ఈ అక్రమ మైనింగ్ కేసులో A4 ముద్దాయిగా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డికి రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో మూడు రోజులపాటు విచారణకు శుక్రవారం ఉదయం నుంచి ఆదివారం వరకు పోలీసు కష్టడీకి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మూడు రోజులపాటు కాకాణిని కృష్ణాపట్నం పోర్టు పోలీసు స్టేషన్లో ఉంచి.. రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. ఈ విచారణలో పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. పలు ప్రశ్నలకు ఆయన వద్ద నుంచి జవాబు రాబట్టే యత్నం చేశారు. కొన్ని ప్రశ్నలకు మాత్రమే.. కాకాణి నుంచి సమాధానాలు రాబట్టారు. ముఖ్యమైన.. ప్రశ్నలు.. నగదు ట్రాన్స్ఫర్, ఇతర అంశాలపై పోలీసులు అడిగిన వాటికి ఆయన్నుంచి సమాధానాలు రాబట్టలేకపోయారని.. అన్నిటికీ.. తెలియదు.. నాకేం సంబంధం లేదు.. నా ప్రమేయం లేదు.. గత ప్రభుత్వ పెద్దలకు అస్సలు సంబంధం లేదు.. ఇంకేం తెలియదు అనే సమాధానాలే చెప్పినట్లు తెలుస్తోంది. కాకాణి విచారణకు కోర్డు ఇచ్చిన మూడురోజుల కష్టడీ గడువు.. ఈరోజు సయంత్రం 5 గంటలకు కష్టడీ ముగియడంతో.. గోవర్థన్‌రెడ్డిని నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి.. అక్కడ వైద్య పరీక్షలు చేయించి.. నెల్లూరు న్యాయస్థానంలో హాజరుపరిచారు. అనంతరం పోలీసు బందోబస్తు నడుమ నెల్లూరు కేంద్ర కారాగారానికి తరలించారు. కాకాణిని పోలీసు కష్టడీ నుంచి జైలుకు తిరిగి తరలిస్తున్నారన్న విషయం తెలుసుకుని.. వైసీపీ నేతలు, కార్యకర్తలు, సర్వేపల్లి నియోజకవర్గ కార్యకర్తలు పెద్ద ఎత్తున జైలు వద్దకు చేరుకున్నారు. అక్కడ కాకాణిని చూడగానే అందరూ భావోద్వేగానికి గురయ్యారు. జై.. కాకాణి.. జై.. జై.. కాకాణి గోవర్థన్‌రెడ్డి అంటూ నినాదాలు చేశారు. ఈసందర్భంగా కాకాణి సైతం చిరునవ్వుతో.. అందరికీ నమస్కరిస్తూ.. పేరు పేరునా.. పలకరిస్తూ.. ఉంటా.. వస్తా.. అంటూ.. జైలులోకి వెళ్లారు. ఈ కేసులో పురోగతి సాధించేందుకు.. మరోసారి కాకాణిని కష్టడీకి ఇవ్వాలని కోర్టును కోరే అవకాశం ఉందని తెలుస్తోంది.