జైలు నుంచి నేరుగా కృష్ణాపట్నం పోలీస్ స్టేషన్‌కి తరలింపు
మూడు రోజులపాటు లాయర్ల సమక్షంలోనే కాకాణి విచారణ
ఆదివారం సాయంత్రం వరకు కృష్ణాపట్నం పీఎస్‌లోనే కాకాణి
బెయిల్ పిటీషన్ 9కి వాయిదా వేసిన విషయం తెలిసిందే
పోలీసు కష్టడీలో ఏం జరగనుంది..?
జైలు నుంచి నేరుగా కృష్ణాపట్నం పోలీస్ స్టేషన్‌కి తరలింపు
మూడు రోజులపాటు లాయర్ల సమక్షంలోనే కాకాణి విచారణ
ఆదివారం సాయంత్రం వరకు కృష్ణాపట్నం పీఎస్‌లోనే కాకాణి
బెయిల్ పిటీషన్ 9కి వాయిదా వేసిన విషయం తెలిసిందే.
అక్రమ మైనింగ్ వ్యవహారంతోపాటు అట్రాసిటీ కేసుల్లో నెల్లూరు కేంద్ర కారాగారంలో రిమాండ్ శిక్ష అనుభవిస్తున్న కాకాణి గోవర్థన్‌రెడ్డిని పోలీసు కష్టడీకి తీసుకున్నారు. ఈ రోజు నుంచి ఆదివారం సాయంత్రం 5 గంటలవరకు ఆయన్ను పోలీసు కష్టడీలోనే ఉంచి.. విచారించనున్నారు. ఇందుకోసం నెల్లూరు కేంద్ర కారాగారం నుంచి ఆయన్ను నేరుగా కృష్ణపట్నం పోలీసు స్టేషన్‌కు తరలించారు. అక్కడే ఈ మూడు రోజులపాటు గోవర్థన్‌రెడ్డిని ఉంచి విచారించనున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే.. ఈ కష్టడీలో కాకాణి ఏం చెప్పనున్నారు..? ఆయనచేత ఏం ఒప్పించనున్నారు..? కాకాణిచేత నిజాలు రాబడతారా..? పోలీసులు అడిగిన ప్రశ్నలకు ఆయన నోరు విప్పుతారా..? లేక బలవంతంగా ఒప్పిస్తారా..? అసలు పోలీసు కష్టడీలో ఏం జరగనుంది..? ఇది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.