లారీలో నుంచి ఉవ్వెత్తున ఎగసి పడిన మంటలు
భయబ్రాంతులకు గురైన స్థానికులు
తడ పోలీసుస్టేషన్ వద్ద ఘటన
పార్సెల్ లారీ దగ్ధం…
- లారీలో నుంచి ఉవ్వెత్తున ఎగసి పడిన మంటలు
- భయబ్రాంతులకు గురైన స్థానికులు
- తడ పోలీసుస్టేషన్ వద్ద ఘటన
తిరుపతి జిల్లా తడలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ధర్మాకోల్ లోడ్ తో ఉన్న పార్శిల్ లారీలో ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. మూడు ఫైర్ ఇంజన్ల సహాయంతో సిబ్బంది మంటల్ని అదుపులోకి తీసుకువచ్చారు.
ధర్మాకోల్ లోడ్ తో వచ్చిన పార్సెల్ లారీ నుంచి ఒక్క సారిగా మంటలు చెలరేగిన సంఘటన…తిరుపతి జిల్లా తడ పోలీసుస్టేషన్ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. దీంతో లారీలో నుంచి మంటలు ఉవ్వెత్తున ఎగసి పడుతుండడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకున్న సూళ్లూరుపేట ఫైర్ ఇంజన్, అపాచీ పరిశ్రమ ఫైర్ ఇంజన్ సాయంతో సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. ధర్మకోల్ లోడ్ కావడంతో మంటలు ఫైర్ ఇంజన్ సాయంతో ఆర్పే ప్రయత్నం చేస్తున్నా మంటలు అదుపులోకి రాలేదు. శ్రీ సిటీ నుంచి వచ్చిన మూడవ ఫైర్ ఇంజన్ సాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అప్పటికే లారీ మొత్తం అగ్నికి ఆహుతైపోయింది. పార్సెల్ లారీలో నుంచి మంటలు వ్యాపించిన ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా తడ పోలీసులు చర్యలు చేపట్టారు.