నెల్లూరు నారాయణలో బైపాస్ సర్జరీలు విజయవంతం

మీడియా సమావేశంలో ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ సాయి కిరణ్

నెల్లూరు నారాయణలో బైపాస్ సర్జరీలు విజయవంతం

  • మీడియా సమావేశంలో ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ సాయి కిరణ్


ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంకు చెందిన వెంకన్న అనే వ్యక్తికి మెదడులో రెండు బైపాస్ సర్జరీలను విజయవంతంగా పూర్తి చేశామని నెల్లూరు నారాయణ హాస్పిటల్ ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ సాయి కిరణ్ తెలిపారు. నారాయణ హాస్పిటల్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించి వివరాలు తెలియజేశారు.


నెల్లూరు నారాయణ హాస్పిటల్ లో మెదడకు అరుదైన బైపాస్ సర్జీలు విజయవంతంగా పూర్తి చేశామని హాస్పిటల్ ప్రముఖ న్యూరోసర్జన్ డాక్టర్ సాయి కిరణ్ తెలిపారు. ఈ సందర్భంగా నారాయణ హాస్పిటల్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంకు చెందిన వెంకన్న అనే వ్యక్తి మోయా అనే అరుదైన వ్యాధితో అనేక హాస్పిటల్స్ లో చూపించుకొని…నయం కాకపోవడంతో నారాయణ హాస్పిటల్ లో తనను సంప్రదించారన్నారు. అతనికి అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించామన్నారు. మెదడకు సంబంధించిన రెండు ముఖ్యమైన రక్తనాళాలు పూర్తిగా బ్లాక్ అయినట్లు గుర్తించామన్నారు. వెంటనే వెంకన్నకి ఆరోగ్య శ్రీ పథకం ద్వారా రూపాయి ఖర్చు లేకుండా…ఎస్టీఏ, ఎంసీఏ బైపాస్ సర్జరీలను విజయవంతంగా పూర్తి చేశామని చెప్పారు. ఇప్పుడు అతను ఆరోగ్యగంగా ఉన్నారని తెలిపారు. ఈ క్లిష్టమైన శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించేందుకు న్యూరో అనస్థీషియా డాక్టర్లు బృందం డాక్టర్ అనిల్, డాక్టర్ పృధ్వీల‌ ఎంతో కృషి చేశార‌ని ప్రశంసించారు. అనంతరం పేషెంట్ భార్య మాట్లాడారు. తన భర్తని కాపాడినందుకు డాక్టర్ సాయి కిరణ్, నారాయణ యాజమాన్యానికి రుణపడి ఉంటానని చెప్పారు. ఈ సమావేశంలో పలువురు వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *