నెల్లూరులో PMJ జ్యువెల్స్

_నూతన స్టోర్ అట్టహాసంగా ప్రారంభం

స్టోర్ ని ప్రారంభించిన నుడా చైర్మన్ కోటంరెడ్డి దంపతులు

మరిన్ని నూతన స్టోర్స్ ని ప్రారంభించాలని కోటంరెడ్డి ఆకాంక్ష

నెల్లూరులో PMJ జ్యువెల్స్
నూతన స్టోర్ అట్టహాసంగా ప్రారంభం..

  • స్టోర్ ని ప్రారంభించిన నుడా చైర్మన్ కోటంరెడ్డి దంపతులు
  • మరిన్ని నూతన స్టోర్స్ ని ప్రారంభించాలని కోటంరెడ్డి ఆకాంక్ష

నెల్లూరు మాగుంట లేఅవుట్లోని అన్నమయ్య సర్కిల్ ప్రాంతంలో పీఎంజే జ్యువెల్స్ స్టోర్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి దంపతులు ముఖ్య అతిధులుగా విచ్చేశారు. వారికి స్టోర్ నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి దంపతులు చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేసి స్టోర్ ని ప్రారంభించారు. దంపతలిద్దరూ స్టోర్ అంతా కలియ తిరిగి ఆభరణాలను తిలకించారు. కొత్త కొత్త డిజైన్లు ప్రజలకి అందించడంలో పీఎంజే స్టో్ర్ ఎప్పుడూ ముందుటుందని యాజమాన్యాన్ని అభినందించారు. అనంతరం నుడా చైర్మన్ శ్రీనివాసులురెడ్డి మీడియాతో మాట్లాడుతూ… భారత్ , USA వేదికల్లో PMJ సుమారు 40కి పైగా స్టోర్ లు కొనసాగుతుండడం గొప్ప విషయమన్నారు. భవిష్యత్లో మరెన్నో స్టోర్ ని ప్రారంభించాలని..అలాగే ప్రజలకి తక్కువ ధరలకే నాణ్యమైన బంగారు ఆభరణాలను అందించాలని ఆయన ఆకాంక్షించారు. PMJ జ్యువెల్స్ ఆంధ్రా బిజినెస్ హెడ్ హైదర్ అలీ, PMJ జ్యువెల్స్ క్లస్టర్ మేనేజర్ అరవింద్ కుమార్, PMJ జ్యువెల్స్ నెల్లూరు స్టోర్ హెడ్ ప్రభాకర్ లు ప్రసంగించారు. తమ స్టోర్ లో సరికొత్త డిజైన్లతో ఆభరణాలను ప్రజలకి అందుబాటులోకి ఉంచుతున్నామని, ఈ అవకాశాన్ని జిల్లా వాసులందరూ సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో షోరూమ్ నిర్వాహకులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *