ఆపితే.. ఆగేది కాదు..

సర్వేపల్లి ప్రజలలో నాన్న పై ఉన్న అభిమానం

కాకాణి మాకు నాయ‌కుడేకాదు.. మార్గ‌ద‌ర్శ‌కి కూడా

జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ఇచ్చిన ప్ర‌తి హామీని నిల‌బెట్టుకున్నారు

కూట‌మి ప్ర‌భుత్వం పూర్తిగా విఫ‌ల‌మైంది_ _మీడియా స‌మావేశంలోకాకాణి పూజిత

ఆపితే.. ఆగేది కాదు..
సర్వేపల్లి ప్రజలలో నాన్న పై ఉన్న అభిమానం
కాకాణి మాకు నాయ‌కుడేకాదు.. మార్గ‌ద‌ర్శ‌కి కూడా
జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ఇచ్చిన ప్ర‌తి హామీని నిల‌బెట్టుకున్నారు
కూట‌మి ప్ర‌భుత్వం పూర్తిగా విఫ‌ల‌మైంది
మీడియా స‌మావేశంలోకాకాణి పూజిత

మా నాన్నని జైల్లో పెట్టినా, కార్యకర్తలు, నాయకులను ఇబ్బందులకు గురిచేసినా, కేసులు పెడతామని భయపెట్టినా, వాటన్నింటిని దాటి నిరసన కార్యక్రమంలో పాల్గొని, విజయవంతం చేయడం సంతోషాన్ని కలిగించిందని.. కాకాణి గోవ‌ర్థ‌న్‌రెడ్డి కుమార్తె.. కాకాణి పూజిత అన్నారు. అరెస్టులతో కేసులతో నాన్నపై సర్వేపల్లి ప్రజలకు ఉన్న అభిమానాన్ని ఆపితే ఆగేది కాద‌ని ఆమె పేర్కొన్నారు. నిరసన కార్యక్రమంలో అధికారులు మమ్మల్ని అడుగడుగున అడ్డుకున్నా, మాకు రక్షణగా సర్వేపల్లి ప్రజలు నిలబడ్డార‌ని.. వారంద‌రికీ పేరు పేరునా ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఈసంద‌ర్భంగా ఆమె నెల్లూరు డైకాస్ రోడ్డులోని వైసీపీ కార్యాల‌యంలో మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి మాట్ల‌డారు. కాకాణి గోవర్ధన్ రెడ్డి మాకు నాయకుడు మాత్రమే కాదు మార్గదర్శి కూడా అని.. కాకాణి గోవర్ధన్ రెడ్డి కుమార్తె కార్యక్రమం చేపట్టలేదని అవహేళనతో అడ్డంకులు సృష్టించినా .. వారందరికీ ఈ కార్యక్రమం విజయవంతం కావడం చెంపపెట్టు అని ఆమె హెచ్చ‌రించారు. తాము కార్యక్రమం చేయగలమనే నమ్మకంతో వెన్నుపోటు కార్య‌క్ర‌మంలో పాల్గొన్న‌ ఎంపీలు మిథున్ రెడ్డి, గురుమూర్తి ల‌కు ధన్యవాదాలు తెలియ‌జేస్తునాన‌న్నారు. త‌మ కుటుంబానికి మెండుగా స‌ర్వేప‌ల్లి ప్ర‌జ‌ల అభిమానం, ప్ర‌మే ఉంద‌ని గ‌మనించాల‌న్నారు. ప్ర‌జ‌లు చేసిన ఈ నిర‌స‌న కార్య‌క్ర‌మం ప్ర‌భుత్వానికి క‌నువిప్పు కావాల‌న్నారు. ఇచ్చిన హామీల‌ను జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి నిలబెట్టుకున్నార‌ని.. కూట‌మి ప్ర‌భుత్వం పూర్తిగా విఫ‌ల‌మైందంటూ ధ్వ‌జ‌మెత్తారు.ఈ సంద‌ర్భంగా ప్ర‌భుత్వంపై.. ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌పై ఇంకా ప‌లు ఆరోప‌ణ‌లు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *