పర్యటన జయప్రదం చేయాలని పిలుపు
మీడియా సమావేశంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు భాస్కర్
చిత్తూరుకి వైఎస్ షర్మిల…
- పర్యటన జయప్రదం చేయాలని పిలుపు
- మీడియా సమావేశంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు భాస్కర్
ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల చిత్తూరు జిల్లా పర్యటనను జయప్రదం చేయాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పోటుగారి భాస్కర్ పిలుపునిచ్చారు. స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఈనెల తొమ్మిదవ తేదీన కార్యకర్తలతో షర్మిల సమావేశమమవుతారన్నారు. అనంతరం ఆమె పర్యటన ప్రారంభం అవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమానికి గ్రామ స్థాయి నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.