మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ
పెద్ద సంఖ్యలో పాల్గొన్న వైసిపి శ్రేణులు
కావలిలో వెన్నుపోటు దినం
- మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ
- పెద్ద సంఖ్యలో పాల్గొన్న వైసిపి శ్రేణులు
కావలి పట్టణంలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెన్నుపోటు దినం నిరసన తెలిపారు. పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా వచ్చి వైఎస్సార్ విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం ట్రంక్ రోడ్డులో నిరసన వ్యక్తం చేశారు. ఆర్డీఓ వంశీ కృష్ణ కు వినతిపత్రం అందజేశారు. మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ… మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి రాగానే ఇవ్వకుండా మోసం చేసినట్లు ఆరోపించారు. వైఎస్ జగన్ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చినట్లు చెప్పారు. తమ ప్రజా సమస్య నిరసనకు అనుమతులు ఇవ్వకుండా అనేక ఇబ్బందులు పెట్టారన్నారు. వైసిపి నాయకులు పాల్గొన్నారు.