ప్రజలకి మంచి చేయడం వైసీపీ నేతలకు ఇష్టం లేదు – మీడియా సమావేశంలో మాజీ ఎస్సీసెల్ అధ్యక్షులు తువ్వర
మంచి చేస్తున్నందకా….వెన్నుపోటు దినం
- ప్రజలకి మంచి చేయడం వైసీపీ నేతలకు ఇష్టం లేదు
- మీడియా సమావేశంలో మాజీ ఎస్సీసెల్ అధ్యక్షులు తువ్వర
నెల్లూరు జిల్లా కొడవలూరు మండల కేంద్రంలో మాజీ ఎస్సీ సెల్ అధ్యక్షులు తువ్వర ప్రవీణ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రజలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మంచి చేస్తున్నందుకా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెన్నుపోటు దినం నిర్వహిస్తుంది అని అన్నారు. ప్రజలకు మంచి చేయడం వైసిపి నాయకులకు ఇష్టం లేదని తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారం చేపట్టగానే తొలి సంతకం అవ్వతాతల పెన్షన్ 3000 నుండి 4000 రూపాయలు చేసినందుకా మీరు వెన్నుపోటు దినం నిర్వహించేది అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కొడవలూరు మండలంలో 10 నెలలకే మూడు కోట్ల రూపాయలు అభివృద్ధి చేసినందుకు మీరు వెన్నుపోటు దినం నిర్వహించేది అని వైసిపి నాయకులను హెచ్చరించారు.