ప్రజ్ఞాపూర్ ప్రభుత్వ బాలికల పాఠశాలలోఎమ్మెల్యే హరీష్ రావు జన్మదిన వేడుకలు

పది విద్యార్థులకి ప్రోత్సాహక బహుమతులు

హరిత సేన ఇన్చార్జి ఆధ్వర్యంలో మొక్కలు నాటిన విద్యార్థులు

ప్రజ్ఞాపూర్ ప్రభుత్వ బాలికల పాఠశాలలో
ఎమ్మెల్యే హరీష్ రావు జన్మదిన వేడుకలు

  • పది విద్యార్థులకి ప్రోత్సాహక బహుమతులు
  • హరిత సేన ఇన్చార్జి ఆధ్వర్యంలో మొక్కలు నాటిన విద్యార్థులు

సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు జన్మదినాన్ని పురస్కరించుకొని..ప్రజ్ఞాపూర్ ప్రభుత్వ బాలికల పాఠశాల ఆవరణంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్, హరిత సేన ఇన్చార్జి రాజేశ్వరరావు ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఫస్ట్, సెకండ్ ర్యాంకులు సాధించిన విద్యార్థులకి ప్రోత్సాహక బహుతమలు అందచేసి అభినందించారు. భవిష్యత్ లో బాగా చదివి మంచి ర్యాంకులు సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ఉన్నత మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహం అందించడం చాలా ఆనందంగా ఉంది అన్నారు. ఇంత గొప్ప అవకాశం కల్పించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు జోగినపల్లి సంతోష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *