దాతలు ఆదుకోండి

బ్రెయిన్ స్ట్రోక్ గురైన ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం స్వీపర్

స్వీపర్ జీవరత్నం కుటుంబానికి రూ. 10వేలు ఆర్ధిక సాయం చేసిన మలిరెడ్డి

దాతలు ఆదుకోండి…

  • బ్రెయిన్ స్ట్రోక్ గురైన ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం స్వీపర్
  • స్వీపర్ జీవరత్నం కుటుంబానికి రూ. 10వేలు ఆర్ధిక సాయం చేసిన మలిరెడ్డి

నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో గత 30 ఏళ్లుగా గ్రౌండ్ మార్కర్ గా, స్వీపర్గా మామిడి జీవరత్నం పని చేస్తున్నాడు. అయితే 25 రోజుల క్రితం మైదానంలోనే పని చేస్తూ ఒక్క సారిగా కిందపడిపోయాడు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అతనికి బ్రెయిన్ స్ట్రోక్ ఉందని వైద్యులు నిర్ధారించారు. ఈ విషయం తెలుసుకున్న సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ప్రెస్ డెంట్ మలిరెడ్డి కోటారెడ్డి జీవరత్నం నివాసానికి వెళ్లారు. అతని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతానికి వైద్య ఖర్చుల కోసం తనవంతుగా రూ. 10వేలు ఆర్ధిక సాయం అందచేశారు. జీవరత్నంను ఎలా కాపాడుకోవాలో అర్ధం కాక దిక్కుతోచని స్థితిలో తన కుటుంబం ఉందని కోటారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వాకర్స్ , అధికారులు, క్రీడాకారులు, దాతలు మానవత్వంతో స్పందించి ఆర్దిక సహాయం అందించాలని ఆయన కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *