IIT JEE అడ్వాన్డ్స్-2025 ఫలితాల్లో నెల్లూరు నారాయణ విజయకేతనం

ఓపెన్ కేటగిరిలో 1 నుంచి 10లోపు ర్యాంకులు సాధించిన విద్యార్థులు

విద్యార్థుల్ని అభినందించిన నారాయణ యాజమాన్యం

IIT JEE అడ్వాన్డ్స్-2025 ఫలితాల్లో
నెల్లూరు నారాయణ విజయకేతనం

  • ఓపెన్ కేటగిరిలో 1 నుంచి 10లోపు ర్యాంకులు సాధించిన విద్యార్థులు
  • విద్యార్థుల్ని అభినందించిన నారాయణ యాజమాన్యం


IIT JEE అడ్వాన్డ్స్-2025 ఫలితాల్లో నారాయణ విద్యా సంస్థల విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారని విద్యా సంస్థల డీన్ రాయుడు పేర్కొన్నారు. నెల్లూరు నగరం రామలింగాపురంలోని నారాయణ కాలేజీలో అభినందన సభ ఏర్పాటు చేసి ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థుల్ని అభినందించారు.


బుధవారం విడుదలైన జేఈఈ అడ్వాన్స్ 2020 ఫలితాల్లో నెల్లూరు నారాయణ ఐఐటీ అకాడమి విద్యార్థులు జాతీయ స్థాయిలో విజయకేతనం ఎగుర వేశారని నారాయణ విద్యా సంస్థల డీన్ రాయుడు తెలిపారు. తమ విద్యార్థులు ఓపెన్ కేటగిరిలో 1 నుంచి 10 లోపు ర్యాంకులు సాధించారని చెప్పారు. నెల్లూరు నగరం హరనాథపురంలోని నారాయణ జూనియర్ కాలేజీలో అభినందన సభ ఏర్పాటు చేశారు. ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థుల్ని విద్యా సంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, కాలేజ్ యాజమాన్యం, అధ్యాపకులు అభినందించారు. ఈ సందర్భంగా రాయుడు మీడియాతో మాట్లాడారు. నారాయణ విద్యా సంస్థల పటిష్టమైన మైక్రో షెడ్యూల్, బోధనా పద్దతులు, పరీక్షా విధానాల వల్లే తమ విద్యార్థులు అత్యత్తమ మార్కులు సాధించారన్నారు. ఇంతటి ఘన విజయానికి సాధించిన విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులకి నారాయణ యాజమాన్యం ధన్యవాదాలు తెలియజేసిందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల కోర్ డీన్ లు, డీన్ లు, డీజీఎంలు, ఏజీఎంలు, ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *