మాజీ ఎమ్మెల్యే అనుచరుడు అరెస్ట్… విడుదల..!

కావలి వైసీపీ యువ నాయకుడు చందు అరెస్ట్, స్టేషన్ బెయిల్ పై విడుదల

విజయదుర్గా రెస్టారెంట్ కు తాళాలు వేసిన కేసులో అరెస్ట్

కారు సీజ్, సోమవారం విచారణకు రావాలని నోటీసు

మాజీ ఎమ్మెల్యే అనుచరుడు అరెస్ట్… విడుదల..!

కావలి వైసీపీ యువ నాయకుడు చందు అరెస్ట్, స్టేషన్ బెయిల్ పై విడుదల
విజయదుర్గా రెస్టారెంట్ కు తాళాలు వేసిన కేసులో అరెస్ట్

కారు సీజ్, సోమవారం విచారణకు రావాలని నోటీసు

కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రధాన అనుచరుడు ఈతముక్కల చందును ఆదివారం రెండో పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఒక్కసారిగా కావలి వైసీపీలో కలకలం రేపింది. విషయం తెలుసుకున్న వైసిపి నాయకులంతా రెండో పట్టణ పోలీసు స్టేషన్ వద్దకు చేరుకున్నారు. సాయంత్రం స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. చందు కారును సీజ్ చేసిన పోలీసులు సోమవారం విచారణకు రావాలని నోటీసు ఇచ్చారు. కావలిలో ప్రముఖ విజయదుర్గా రెస్టారెంట్ కు ఆదివారం మధ్యాహ్నం చందు తాళాలు వేశారు. ఈ రెస్టారెంట్ చందు, వైసిపి నుంచి సస్పెన్షన్ కు గురైన మాజీ ఏ ఎంసీ చైర్మన్ మన్నెమాల సుకుమార్ రెడ్డి భాగస్వామయంతో ఉన్నట్లు తెలిసింది. ఇద్దరి మధ్య నెలకొన్న వివాదం రెస్టారెంట్ కు తాళాలు వేసే వరకు వెళ్ళింది. సుకుమార్ రెడ్డి పిర్యాదుతో రెస్టారెంట్ వద్దకు వెళ్ళిన పోలీసులు అక్కడే ఉన్న చందుతో మాట్లాడారు. రెస్టారెంట్ వద్దకు దొమ్మిగా రావడంతో కేసు నమోదు చేసి.. చందును అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. అతని కారును సీజ్ చేశారు. గతంలో చందుపై ఏమైనా కేసులు ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని తెలుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *