ప్రపంచ స్థాయి సమ్మిటర్స్ సమ్మిట్లో నెల్లూరీయుడు

భవిష్యత్లో చేపట్టబోయే అంశాల గురించి ప్రసంగించిన సూర్యప్రకాష్_

ప్రపంచ స్థాయి సమ్మిటర్స్ సమ్మిట్లో నెల్లూరీయుడు

  • భవిష్యత్లో చేపట్టబోయే అంశాల గురించి ప్రసంగించిన సూర్యప్రకాష్


నేపాల్లో జరిగిన ఎవరెస్ట్ సమ్మిటర్స్ సమ్మిట్లో నెల్లూరుకి చెందిన పర్వతారోహకుడు కేవీ సూర్య ప్రకాష్ ప్రసంగించారు. భవిష్యత్ లో పర్వతారోహణ అభివృద్ధి గురించి ప్రపంచ వ్యాప్తంగా చేపట్టబోయే అంశాల గురించి ఈ సమ్మిట్లో చర్చించారు.


నేపాల్ లో జరిగిన ఎవరెస్ట్ సమ్మిటర్స్ సమ్మిట్ లో నెల్లూరుకి చెందిన ప్రముఖ పర్వతారోహకుడు కెవి. సూర్యప్రకాష్ హాజరయ్యారు. ప్రపంచ దేశాల నుండి ఎవరెస్ట్ ఎక్కిన పర్వతారోహకులకు వేదికగా నేపాల్లో జరిగిన ఈ సమావేశంలో సూర్య ప్రకాష్ పాల్గొన్నారు.
ప్రపంచంలోని వివిధ దేశాల నుండి ఎవరెస్ట్ అధిరోహించిన పర్వతారోహకులు భవిషత్ లో పర్వతారోహణ అభివృద్ధి గురించి చర్చించుకున్నారు. అందులో భాగంగా మన నెల్లూరుకి చెందిన సూర్యప్రకాష్ కు నేపాల్ దేశ రక్షణ శాఖ మరియు టూరిజం శాఖ మంత్రి బద్రి ప్రసాద్ పాండే చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. సంప్రదాయ దుస్తులతో సూర్య ప్రకాష్ అవార్డు అందుకోవటం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *