మళ్లీ కెసిఆర్ అధికారంలోకి వస్తారు – దమ్మపేటలో ఘనంగా వేడుకలు
ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం
మళ్లీ కెసిఆర్ అధికారంలోకి వస్తారు
దమ్మపేటలో ఘనంగా వేడుకలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక నాయకులు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ చేసి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు జేజేలు పలికారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి దొడ్డ రమేష్ మాట్లాడుతూ, ఎందరో అమరుల త్యాగం తెలంగాణ రాష్ట్ర ఫలితం అని, కెసిఆర్ తప్పక మళ్ళీ అధికారంలోకి వస్తారని తెలిపారు
ఈ కార్యక్రమంలో స్థానిక టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.