దేవుడిమీద ఒట్టేసి మాటతప్పిండు..!
మాజీ మంత్రి హరీష్‌రావు_ _జగదేవ్‌పూర్ మండలం.. తీగుల్ గ్రామంలో
తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన హరీష్‌రావు
రేవంత్‌రెడ్డిది పూటకో వేషం
దేవుడిమీద ఒట్టేసి మాటతప్పిండు..!
మాజీ మంత్రి హరీష్‌రావు
జగదేవ్‌పూర్ మండలం.. తీగుల్ గ్రామంలో
తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన హరీష్‌రావు
తెలంగాణ రాష్ట్రం.. సిద్దిపేట జిల్లా.. జగదేవ్‌పూర్ మండలం.. తీగుల్ గ్రామంలో మాజీ మంత్రి హరీష్‌రావు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై ఓ రేంజ్‌లో మండిపడ్డారు.. సెటైర్లు వేశారు. తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రేవంత్‌రెడ్డిది పూటకో వేషం అని.. దేవుడి మీద ఒట్టు పెట్టి.. మాట తప్పిన మొనగాడంటూ ఎద్దేవా చేశారు. దేవుడినే మోసం చేసినవాడు.. ఇక ప్రజలను మోసం చేయడా అంటూ.. చలోక్తులు విసిరారు. కేసీఆర్ కంటే నేను ఎక్కువ ఇస్తానని చెప్పి.. మోసం చేశాడంటూ సీఎంపై విమర్శలు చేశారు. ఈ కార్యక్రమంలో.. ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, వంటేరు ప్రతాప్ రెడ్డి, సిద్ధిపేట నాయకులు, కార్యకర్తలున్నారు.