వైసీపీ తరపున తామంతా అండగా ఉంటామని భరోసా
కాకాణి కుటుంబ సభ్యులతో నల్లపరెడ్డి భేటీ…
- వైసీపీ తరపున తామంతా అండగా ఉంటామని భరోసా
మాజీ మంత్రి కాకాణి కుమార్తెని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఏం అధైర్య పడొద్దని..పార్టీ తరపున తామంతా అండగా ఉంటామని ఆయన కొండంత ధైర్యాన్ని ఇచ్చారు.
అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి రిమాండ్ లో ఉన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా డైకస్ రోడ్డులోని కాకాణి నివాసంలో కాకాణి కుమార్తె పూజిత, వారి కుటుంబ సభ్యుల్ని మాజీ మంత్రి, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ ఆయన సతీమణి పూజారెడ్డిలు మర్యాదపూర్వకంగా కలిశారు. కాకాణి అక్రమ అరెస్ట్ ని ఆయన తీవ్రంగా ఖండించి వారి కుటుంబానికి సంఘీభావాన్ని తెలియజేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున తాము అండగా ఉంటామని ప్రసన్నకుమార్ రెడ్డి భరోసా కల్పించారు. ఆయన వెంట వైసీపీ నేతలు ఉన్నారు.