
కడప రైల్వే స్టేషన్లో మాక్ డ్రిల్
అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కడప రైల్వే స్టేషన్లో మాక్ డ్రిల్… కడప రైల్వే స్టేషన్ లో జిల్లా కలెక్టర్ శ్రీధర్, అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. పోలీస్, రెవెన్యూ, మునిసిపల్, అగ్నిమాపక శాఖ,ఇతర అధికారుల ఆధ్వర్యంలో డ్రిల్ చేపట్టారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను డ్రిల్ నిర్వహించి ప్రయాణికులకి కళ్లకట్టినట్లు చూపించారు. ప్రమాదం సంభవిస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటారో సిబ్బంది మాక్ డ్రిల్ చేసి చూపించారు.