ఘనంగా సీఐటీయూ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఇందుకూరుపేటలో సీఐటీయూ జెండా ఆవిష్కరణ, కేక్ కటింగ్

ఘనంగా సీఐటీయూ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
ఇందుకూరుపేటలో సీఐటీయూ జెండా ఆవిష్కరణ, కేక్ కటింగ్


ఇందుకూరుపేటలో సీఐటీయూ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.


నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలో సిఐటియు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సిఐటియు నెల్లూరు జిల్లా అధ్యక్షులు ప్రసాద్ రెడ్డి అధ్యక్షతన సిఐటియు జెండా ఆవిష్కరణ చేసి, కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. సిఐటియు 1970లో ఏర్పడిందని గుర్తు చేశారు. కార్మికుల ఆర్థిక సమస్యలపైన పెద్ద ఎత్తున ఆందోళనలు, పోరాటాలను నిర్వహిస్తుందని తెలిపారు. సుదీర్ఘ పోరాటాలు చేస్తూ అన్ని రంగాల్లో సిఐటియు విస్తరిస్తుందని ఆన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల అధ్యక్షులు షేక్ చాన్ భాష, సిఐటియు మండల కార్యదర్శి మైపాటి కోటేశ్వరరావు, యూనియన్ అధ్యక్షులు వాసు, కార్యదర్శి దయాసాగర్, సీఐటీయూ కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *