నేటి వార్త మాలిక‌

క‌ల్తీలేని వార్త‌లు సంచ‌ల‌నం రేపే క‌థ‌నాలు

కడపలో మూడో రోజు జరుగుతున్న మహానాడు బహిరంగ సభకు రెండు తెలుగు రాష్ట్రాల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో వెళ్లారు. దీంతో మహానాడు ప్రాంగణం పసుపుమయంగా మారిపోయింది.

వీఆర్ హైస్కూల్లో ఆధునీకరణ అభివృద్ధి పనులను మంత్రి నారాయణ కుమార్తె పొంగూరు షరణి పరిశీలించారు. హై స్కూల్ లోని ప్రతి తరగతి గదికి వెళ్లి జరుగుతున్న అభివృద్ధి పనులను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కుమార్తె కాకాణి పూజితతో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. నెల్లూరు నగరం డైకస్ రోడ్డులోని కాకాణి నివాసంలో ఆమెని అనిల్ కలసి తమ సంఘీభావాన్ని తెలియజేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున తాము అండగా ఉంటామని భరోసా కల్పించారు.

టీడీపీ కార్యకర్తల భారాన్ని మంత్రి లోకేష్ తన భుజాలపై మోస్తున్నారని ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి అన్నారు. కడపలో జరుగుతున్న మహానాడు విజయోత్సవ సభకు వీపీఆర్ దంపతుల ఆధ్వర్యంలో కోవూరు నియోజకవర్గ నుంచి టీడీపీ శ్రేణులు భారీగా తరలి వెళ్లారు. కార్యకర్తలు ప్రయాణిస్తున్న బస్సులను వారు ముందుకు కదిలించారు.

కడప మహానాడుకు ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున తరలి వెళ్లారు. పది నియోజకవర్గాల నుంచి వేల సంఖ్యలో వివిధ వాహనాల్లో వెళ్లి మహానాడుకు హాజరయ్యారు.

కాలం చక్రం వేగంగా మారిపోతుంటుందని…ఈరోజు కాకపోయినా రేపు మాకు ఒక రోజు వస్తుందంటూ మాజీ మంత్రి కాకాణి కుమార్తె పూజిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు.

వెంకటగిరి సర్కి్ల్ పరిధిలోని మద్యం దుకాణాలను ఎక్సైజ్ అధికారులు తనిఖీ చేశారు. సిబ్బందికి పలు సూచనలు, సలహాలు చేశారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

సీపీఎం పార్టీ ధృవ‌తార‌, ప్రముఖ పోరాట యోధులు కామ్రేడ్ జక్కా వెంకయ్య వర్ధంతి వేడుకలు నెల్లూరు నగర వ్యాప్తంగా జరిగాయి. జక్కా వెంకయ్య చిత్రపటానికి పలువురు సీపీఎం నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన చేసిన సేవల్ని కొనియాడారు.

కైవల్యా నదిలోకి ప్రమాదశాత్తు ఓ ఆటో దూసుకెళ్లింది. ఆటోలో ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

ప్రయాణిస్తున్న బొగ్గు లారీ షార్ట్ సర్క్యూట్ కారణంగా పొగలు చెలరేగాయి. మంటల్ని అదుపు చేసే క్రమంలో టైరు పేలి ఆర్అండ్ బీ రెస్క్యూ టీం మెంబర్ కి స్వల్ప గాయాలయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *