అగ్నికి బూడిడైపోయిన రికార్డులు, ఫైళ్లు, సీసీ టీవీ కెమెరా
కండలేరు గెస్ట్ హౌస్లో మంటలు…
- అగ్నికి బూడిడైపోయిన రికార్డులు, ఫైళ్లు, సీసీ టీవీ కెమెరా
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో…స్టోర్ రూమ్ లో మంటలు వ్యాపించిన ఘటన… నెల్లూరు జిల్లా రాపూరు మండలం కండలేరు జలాశయ వసతి గృహంలో చోటు చేసుకుంది. దీంతో స్టోర్ రూమ్ లో మంటలు చెలరేగడంతో పలు రికార్డులు, ఫైల్స్, సి సి టీవీ కెమెరా,ఎలక్ట్రికల్ వైర్స్ కాలిపోయాయి. షార్ట్ సర్క్యూట్ జరిగిన సమయంలో సిబ్బంది వెంటనే స్పందించి మంటలు ఆర్పి, ఫైర్ ఆఫీసుకు సమాచారం అందించడంతో పెద్ద ప్రమాదం తప్పడంతో అధికారులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.