నెల్లూరు పోలీసు శిక్షణా కేంద్రంలో అత్యంత రహస్యంగా విచారణ
వివరాలు రాబడుతున్న ఏఎస్పీ, రూరల్ డీఎస్పీ
సోమవారం ఉదయం వెంకటగిరి కోర్టుకు తరలింపు
అక్కడి నుంచి నేరుగా రాజమండ్రి సెంట్రల్ జైలుకు..?
నెల్లూరు పోలీసు శిక్షణా కేంద్రంలో అత్యంత రహస్యంగా విచారణ
వివరాలు రాబడుతున్న ఏఎస్పీ, రూరల్ డీఎస్పీ
సోమవారం ఉదయం వెంకటగిరి కోర్టుకు తరలింపు
అక్కడి నుంచి నేరుగా రాజమండ్రి సెంట్రల్ జైలుకు..?
రుస్తుం మైనింగ్‌లో అక్రమాలు, అట్రాసిటీ కేసులతోపాటు ఇతర ఆరోపణలపై అజ్ణాతంలో ఉన్న కాకాణిని కేరళలో పోలీసులు అరెస్టు చేసి.. అక్కడి నుంచి రోడ్డు మార్గాన కాకాణిని రాత్రి నెల్లూరుకు తీసుకొచ్చారు. శాంతి భద్రతలు, రాజకీయ ఆందోళనలు జరిగే అవకాశం ఉండడంతో.. కాకాణిని నెల్లూరు రూరల్ నియోజకవర్గం.. చంద్రబాబునగర్‌లోని జిల్లా పోలీసు శిక్షణా కేంద్రంకు రహస్యంగా తరలించారు. అక్కడ మీడియా, వైసీపీ, ఇతరులెవర్నీ అనుమతించకుండా.. పగడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేశారు. బారీకేట్లు ఏర్పాటుచేసి.. మరీ.. ఆయన్ను లోపల ఉంచి.. ప్రత్యేకంగా విచారిస్తున్నారు. ఏఎస్పీ, రూరల్ డీఎస్పీలు ఇద్దరూ కాకాణి వద్ద నుంచి వివరాలు సేకరిస్తున్నారు. తెల్లవారుజాము లోపు రికార్డు కూడా తయారుచేయనున్నట్లు సమాచారం. గూడూరు కోర్టులో ఆయన్ను సోమవారం హాజరుపరచాలని ముందుగా పోలీసులు నిర్ణయించుకున్నా.. ఆ కోర్డు మెజిస్ట్రేట్ లీవ్‌లో ఉండటంతో వెంకటగిరి కోర్టుకు తరలించేలా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కోర్టులో విచారణ అనంతరం ఆయన్ను నేరుగా రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక్కడైతే.. శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉండటంతో.. రాజమండ్రికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.