పాత నేరస్తులపై నిఘా పెంచాలి

ప్రాపర్టీ నేరాలు జరగకుండా తగు చర్యలు చేపట్టాలి

నవాబుపేట పోలీసుస్టేషన్ ను సందర్శించిన ఎస్పీ కృష్ణకాంత్

స్టేషన్లో పచ్చదనం పెంచాలని సిబ్బందికి సూచన

పాత నేరస్తులపై నిఘా పెంచాలి…

  • ప్రాపర్టీ నేరాలు జరగకుండా తగు చర్యలు చేపట్టాలి
  • నవాబుపేట పోలీసుస్టేషన్ ను సందర్శించిన ఎస్పీ కృష్ణకాంత్
  • స్టేషన్లో పచ్చదనం పెంచాలని సిబ్బందికి సూచన


నవాబుపేట పోలీసుస్టేషన్ ని జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీసులు, సిబ్బందికి ఆయన పలు సూచనలు, సలహాలు చేశారు. పాత నేరస్తులపై నిఘా పెంచాలని ఆయన ఆదేశించారు.


సమాజంలో చురుగ్గా వ్యవహరిస్తున్న రౌడీషీటర్ లు, సస్పెక్ట్ లు, పాత నేరస్తులపై నిఘా పెంచాలని జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పోలీసు అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. నెల్లూరు నగరం నవాబుపేట పోలీసుస్టేషన్ ను ఆయన సందర్శించారు. స్టేషన్ పరిసరాలను, పోలీసు స్టేషన్స్ మ్యాప్, చార్ట్, జనరల్ డైరీ లను పరిశీలించి, పచ్చదనం పెంచాలని సూచించారు. విజబుల్ పోలీసింగ్, పెట్రోలింగ్ వ్యవస్థను ముమ్మరం చేయాలి. అదేవిధంగా వాహనాలు క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ సిబ్బంది యోగ క్షేమాలు, శాఖాపరమైన సమస్యలను అడిగి వెంటనే పరిష్కరించాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *