ఇద్దరు దొంగలు అరెస్ట్

రిమాండ్ కు తరలింపు

మీడియా సమావేశంలో వాకాడు ఎస్ఐ నాగబాబు

ఇద్దరు దొంగలు అరెస్ట్…

  • రిమాండ్ కు తరలింపు
  • మీడియా సమావేశంలో వాకాడు ఎస్ఐ నాగబాబు


ఓ ఇంట్లో చోరీకి పాల్పడి బంగారు నగలు, నగదు, వెండి వస్తువులు దోచుకెళ్లిన కేసులో ఇద్దరు నిందితుల్ని వాకాడు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు సీఐ నాగబాబు మీడియా సమావేశం నిర్వహించి మీడియా వివరాలు వెల్లడించారు.

ఏప్రిల్ 27న వాకాడు మండలం వాకాడు గ్రామంలోని స్వర్ణముఖి నది పక్కన ఉన్న ఓ ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు ప్రవేశించి బంగారు ఆభరణాలు, నగదు చోరీ చేశారని బాధితుల ఫిర్యాదు చేశారని ఎస్ఐ నాగబాబు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి ఇద్దరు ముద్దాయిలను అరెస్టె చేయడం జరిగిందన్నారు. డీఎస్పీ గీతా కుమారు, సీఐ హుస్సేన్ ల ఆదేశాల మేరకు వారిని రిమాండ్ కు తరలించామని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన తన కార్యాలయంలో నిందితుల్ని ఎన్3 న్యూస్ ఎదుట హాజరుపరచి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *