ఘనంగా జూ.ఎన్టీఆర్ బర్త్ డే వేడుకలు

మోపూరు సాయి కిరణ్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్, పేదలకు అన్నదానం

ఘనంగా జూ.ఎన్టీఆర్ బర్త్ డే వేడుకలు…

  • మోపూరు సాయి కిరణ్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్, పేదలకు అన్నదానం


సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. మోపూరు సాయికిరణ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి…నిరుపేదలకు అన్నదానం చేశారు.


నెల్లూరు నగరం నవాబుపేటలోని పోలీసు కోర్టర్స్ లో జూ.ఎన్టీఆర్ అభిమాని మోపూరు సాయికిరణ్ ఆధ్వర్యంలో జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు చినగా వెంకటేశ్వర్లు విచ్చేశారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అందరికి పంచి పెట్టి హ్యాపీ బర్త్ డే ఎన్టీఆర్ అన్న శుభాకాంక్షలు తెలియజేశారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సుమారు 400 మంది పేదలకు అన్నదానం చేశారు. అనంతరం వెంకటేశ్వర్లు, సాయి కిరణ్ లు మీడియాతో మాట్లాడారు. గత 22 ఏళ్లుగా తమ అభిమాన హీరో జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే సంబరాలను ఓ పండుగలా జరుపుతున్నామన్నారు. భవిష్యత్ లో మంచి మంచి సినిమాలు తీయాలని, అద్భుత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ అభిమానులు అబ్దుల్, వెంకటేష్, కన్నా, క్రాంతి, నందమూరి అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *