మీడియా సమావేశంలో గువకల్లు పంచాయతీ రైతులు
దుష్ప్రచారం చేయడం తగదు
- మీడియా సమావేశంలో గువకల్లు పంచాయతీ రైతులు
భూముల ఆక్రమించామంటూ తమపై దుష్ప్రచారం చేయడం తగదని గుకవల్లు పంచాయతీకి చెందిన రైతులు వాపోయారు. చిత్తూరులోని ప్రెస్ క్లబ్ లో వారు మీడియాతో మాట్లాడారు.
భూముల ఆక్రమించామంటూ తమపై దుష్ప్రచారం చేయడం తగదని చిత్తూరు మండలం గువకల్లు పంచాయతీకి చెందిన రైతులు తెలిపారు. చిత్తూరు ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తమ అనుభవంలో ఉన్న భూముల్లో మామిడి చెట్ల నాటామని.. అయితే పాస్ బుక్ లేదనే కారణంతో తహసిల్దారు తాము నాటిన మామిడి చెట్లను తొలగించారని తెలిపారు. దీనిపై మేము హైకోర్టును ఆశ్రయించామని, ఈ మేరకు హైకోర్టు తాసిల్దార్ కు తగు ఆదేశాలు ఇచ్చిందన్నారు. అయితే తమపై దుష్ప్రచారం చేయడం సరికాదని వాపోయారు. సమావేశంలో రైతులు మోహన్ నాయుడు, జేజులు, పవన్ కుమార్, జయరాం నాయుడు తదితరులు పాల్గొన్నారు.