దగదర్తి వైసీపీలో కుదుపు

కావలి మాజీ ఎమ్మెల్యే, వైసిపి ఇంచార్జీ ప్రతాప్ కుమార్ రెడ్డి ఆదేశాలు బేఖాతరు

దగదర్తి వైస్ ఎంపీపీ ఎంపికలో వ్యతిరేకంగా వైసిపి ఎంపీటీసీ సభ్యుల ఓటింగ్

దగదర్తి జడ్పీటీసీ, ఎంపీపీ, చెన్నూరు ఎంపీటీసీలపై సస్పెన్షన్ కు పార్టీ అధిష్టానానికి సిఫారసు

దగదర్తి వైసీపీలో కుదుపు…

  • కావలి మాజీ ఎమ్మెల్యే, వైసిపి ఇంచార్జీ ప్రతాప్ కుమార్ రెడ్డి ఆదేశాలు బేఖాతరు
  • దగదర్తి వైస్ ఎంపీపీ ఎంపికలో వ్యతిరేకంగా వైసిపి ఎంపీటీసీ సభ్యుల ఓటింగ్
  • దగదర్తి జడ్పీటీసీ, ఎంపీపీ, చెన్నూరు ఎంపీటీసీలపై సస్పెన్షన్ కు పార్టీ అధిష్టానానికి సిఫారసు


కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఆదేశాలను దగదర్తి మండల ఎంపీటీసీ సభ్యులు బేఖాతారు చేశారు. ప్రతాప్ కుమార్ రెడ్డి సూచించిన ఎంపీటీసీ మహేష్ నాయుడును కాకుండా కుడుముల చెన్నమ్మను వైస్ ఎంపీపీగా ఎన్నుకున్నారు. దీంతో పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించిన ఎంపీటీసీలపై క్రమశిక్షణా చర్యలకు రామిరెడ్డి సిద్ధమయ్యారు.


నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం దగదర్తి వైసీపీలో వ్యతిరేక ప్రకంపనలు మొదలయ్యాయి. సోమవారం జరిగిన రెండో వైస్ ఎంపీపీ ఎన్నికలో కావలి మాజీ ఎమ్మెల్యే, వైసిపి ఇంచార్జీ ప్రతాప్ కుమార్ రెడ్డి ఆదేశాలను ఎంపీటీసీ సభ్యులు బేఖాతరు చేశారు. ప్రతాప్ కుమార్ రెడ్డి సూచించిన బోడిగుడిపాడు ఎంపీటీసీ మహేష్ నాయుడును కాకుండా ఉలవపాళ్ళ ఎంపీటీసీ సభ్యురాలు కుడుముల చెన్నమ్మను వైస్ ఎంపీపీగా ఎన్నుకున్నారు. మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి విప్ జారీ చేసినా లెక్కచేయలేదు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడిన ఎంపీపీ, మండల వైసిపి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న తాళ్లూరి ప్రసాద్ నాయుడు, ఆయన సతీమణి జడ్పీటీసీ అయిన తాళ్లూరి స్వరూపరాణి, చెన్నూరు ఎంపీటీసీ చలంచర్ల సుశీలను పార్టీ క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని పార్టీ అధిష్టానానికి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి సిఫారసు చేశారు. మొత్తం 11 ఎంపీటీసీ సభ్యులు ఉండగా ఉలవపాళ్ల ఎంపీటీసీ సభ్యురాలు పీతల కామేశ్వరికి ప్రభుత్వ ఉద్యోగం రావడంతో తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఇదే స్థానంలో కుడుముల చెన్నమ్మను ఏకగ్రీవంగా ఎన్నుకుని వైస్ ఎంపీపీనీ చేశారు. ఈ వ్యవహారంలో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి చతురత ఉన్నట్లు తెలుస్తుంది. దగదర్తి మండలంలో రాజకీయంగా మంచి పట్టున్న తాళ్లూరి కుటుంబం టీడీపీలో చేరుతారని ప్రచారం ఉంది. కానీ అక్కడ అనాదిగా టిడిపిలో ఉన్న మాలేపాటి సుబ్బానాయుడు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తుంది. టిడిపిలోకి తాళ్లూరి కుటుంబం వస్తే పరిస్థితి ఏమిటన్నది ఆసక్తిగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *