-రేపు ఉదయం 7.59 గం.లకు కౌంట్‌డౌన్ ప్రారంభం
18వ తేదీ ఉదయం 5.59 గం.లకు ప్రయోగం
సూళ్లూరుపేట శ్రీచెంగాళమ్మను దర్శించుకుని..
ప్రత్యేక పూజలు నిర్వహించిన ఇస్రో ఛైర్మన్ నారాయణ్
షార్ నుంచి నింగిలోకి పీఎస్ఎల్‌వీ సి-61 రాకెట్
రేపు ఉదయం 7.59 గం.లకు కౌంట్‌డౌన్ ప్రారంభం
18వ తేదీ ఉదయం 5.59 గం.లకు ప్రయోగం
సూళ్లూరుపేట శ్రీచెంగాళమ్మను దర్శించుకుని..
ప్రత్యేక పూజలు నిర్వహించిన ఇస్రో ఛైర్మన్ నారాయణ్
శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి ఈనెల 18వ తేదీ ఉదయం 5.59 గంటలకు నింగిలోకి పీఎస్ఎల్‌వీ సి-61 రాకెట్ ప్రయోగం జరగనుంది. అందుకు సంబంధించి రేపు శనివారం ఉదయం 7.59 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభం కానుంది. ఈ ప్రయోగం విజయవంతం కావాలని ఇస్రో ఛైర్మన్ నారాయణ్ సూళ్లూరుపేట గ్రామ దేవత శ్రీ చెంగాళమ్మను దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. ఈ ప్రయోగానికి 22 గంటలపాటు నిర్విరామంగా కౌంట్ డౌన్ కొనసాగనుంది. ఆ తర్వాత ఆదివారం ఉదయం రాకెట్ ప్రయోగం జరుగుతుంది. ఈసందర్భంగా ఇస్రో ఛైర్మన్ మీడియాతో మాట్లాడారు. ఈ ప్రయోగంలో పూర్తి స్వదేశీ పరిజ్ణానంతో రూపొందించిన ఈవోఎస్-09 నింగిలోకి పంపనున్నారు. హై రేజ్యూల్యూషన్ కెమెరాలతో భారత దేశ భూ భాగాన్ని పరిశీలించడం eos..9 ముఖ్యఉద్దేశ్యం. ఈఏడాదిలో నెలకో రాకెట్ ప్రయోగం చేపడుతామని ఈసందర్భంగా ఛైర్మన్ తెలిపారు. వచ్చేనెలలో GSLV.. F16 రాకెట్ ప్రయోగం ద్వారా ఇస్రో, నాసా సంయుక్తంగా నిర్మిస్తున్న నిసార్ SAT నింగిలోకి పంపుతున్నామన్నారు. అలాగే.. మరో రెండు నెలల వ్యవధిలో గగన్యాన్ రెండవ టెస్టెడ్ రాకెట్ ప్రయోగం ఉంటుందన్నారు. ఇస్రో ప్రస్థానం 63 ఏళ్ళని.. PSLV పరంపరలో PSLV.. C61 రాకెట్ ప్రయోగం 63 వ రాకెట్ ప్రయోగం గర్వకారణం అన్నారు. ఈ PSLV.. C61 రాకెట్ ప్రయోగం విజయవంతం కోసం ఇస్రో శాస్త్రవేత్తలు అహర్నిశలు శ్రమిస్తున్నారని ఈ సందర్భంగా ఇస్రో ఛైర్మన్ నారాయణ్ తెలియజేశారు.