కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ
ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిచే అందజేత
బాధితులకు అండగా సీఎం సహాయ నిధి
- కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ
- ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిచే అందజేత
కావలిలో ముఖ్యమంత్రి సహాయ నిధి నగదు చెక్కులను పంపిణీ కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా 19 లక్షలా 94 వేల 427 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి నగదు చెక్కులను ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి 18 మంది లబ్ధిదారులకు మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి ప్రధాత చంద్రబాబు సహకారంతో అభివృద్ధి, సంక్షేమం ఎజెండాగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. కావలి నియోజకవర్గం నుంచి దరఖాస్తు చేసుకున్న నెల రోజుల్లోనే సీఎం సహాయనిధి లబ్ధిదారులకు అందిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిది అన్నారు. సీఎం చంద్రబాబు సహకారంతో కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్, ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, రాష్ట్రకార్యవర్గ సభ్యులు మలిశెట్టి వెంకటేశ్వర్లు, కావలి కాలువ డిస్ట్రిబ్యూటరీ చైర్మన్ కండ్ల గుంట మధుబాబు నాయుడు, టిడిపి నాయకులు శానం హరి , కిరణ్ , ఏగురు జగన్, చిలకపాటి శ్రీను, తదితరులు ఉన్నారు.