సంబంధం లేని కేసులో నా బిడ్డను ఇరికించారు

పోలీసు ఉన్నతాధికారులు పరిశీలించి న్యాయం చేయండి

పోలీసు గ్రీవెన్స్ లో వినతి పత్రం అందచేసి సౌటూరి వెంకటమ్మ

సంబంధం లేని కేసులో నా బిడ్డను ఇరికించారు…

  • పోలీసు ఉన్నతాధికారులు పరిశీలించి న్యాయం చేయండి
  • పోలీసు గ్రీవెన్స్ లో వినతి పత్రం అందచేసి సౌటూరి వెంకటమ్మ


సంబంధం లేని కేసులో నా బిడ్డను ఇరికించారని తల్లి సౌటూరి వెంకటరమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసు ఉన్నతాధికారులు పరిశీలించి న్యాయం చేయాలని ఎస్పీ గ్రీవెన్స్ లో అడిషన్ ఎస్పీకి ఆమె వినతి పత్రం అందచేశారు.


తమకు ఎటువంటి సంబంధం లేని దొంగతనం కేసులో ఇరికించారని జిల్లా ఎస్పీ విచారణ చేసి తమ బిడ్డకు న్యాయం చేయాలని సౌటూరి వెంకటమ్మ అడిషనల్ ఎస్పీ సీహెచ్ సౌజన్యను కోరారు. నెల్లూరు ఎస్పీ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వెంకటేశ్వరపురంకి చెందిన వెంకటమ్మ వినతి పత్రం అందచేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ… ఇందుకూరుపేట పోలీసులు తన పెద్ద కుమారుడు అశోక్ కు ఎటువంటి సంబంధం లేదని ఓ దొంగతనం కేసులో అన్యాయంగా ఇరికించి ఇబ్బందుల పాల్జేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాచి పనులు చేసుకొని జీవించే తాను ఆటో నడుపుకొని కష్టపడి బతికే తమ బిడ్డ మీద పోలీసులు అనవసరంగా కేసులు కట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఉన్నతాధికారులు పరిశీలించి తమకు న్యాయం చేయాలని ఆమె మీడియా ఎదుట గోడు వెల్లబోసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *