నారాయణలో ఘనంగా అంతర్జాతీయ నర్సుల దినోత్సవం
కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న నర్సులు
జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన
మెడికల్ కాలేజ్ సూపరింటెండెంట్ డాక్టర్ హరి ప్రసాద్ రెడ్డి
నర్సుల సేవలు వెలకట్టలేనివి…
- నారాయణలో ఘనంగా అంతర్జాతీయ నర్సుల దినోత్సవం…
- కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న నర్సులు
- జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన మెడికల్ కాలేజ్ సూపరింటెండెంట్ డాక్టర్ హరి ప్రసాద్ రెడ్డి
ఫ్లోరెన్స్ నైటింగేట్ జయంతిని పురస్కరించుకొని… నెల్లూరులోని నారాయణ మెడికల్ కాలేజీలో అంతర్జాతీయ నర్సుల దినోత్సవం ఘనంగా జరిగింది. కాలేజ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ హరి ప్రసాద్ రెడ్డి, పలువురు వైద్యులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నర్సులు కేక్ కట్ చేసి అంతర్జాతీయ నర్సుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఫ్లోరెన్స్ నైటింగేట్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నర్సులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం డాక్టర్ హరి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ…నర్సుల సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. వైద్య రంగంలో నర్సుల పాత్ర ఎంతో కీలకమని చెప్పారు. నర్సులు మాట్లాడుతూ…ఫ్లోరెన్స్ నైటింగేట్ జయంతి సందర్బంగా నర్సుల దినోత్సవం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. నారాయణ యాజమాన్యం తమకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. కార్యక్రమంలో మెడికల్ కాలేజీ వైద్యులు, సిబ్బంది, నర్సులు పాల్గొన్నారు.