వెంకటగిరి సీఐ రమణ
దొంగలున్నారు జాగ్రత్త…
- వెంకటగిరి సీఐ రమణ
వేయి లింగేశ్వరస్వామి వారిని వెంకటగిరి సీఐ రమణ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరునాళ్లలో దొంగలు ఉన్నారని భక్తులందరూ జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు.
కొల్లితోట వేయి లింగేశ్వర స్వామి తిరుణాల మహోత్సవంలో వెంకటగిరి సీఐ రమణ పాల్గొన్నారు. సీఐ రమణ స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన ఎన్ 3 న్యూస్ తో మాట్లాడుతూ… అటవీ ప్రాంతమైన కొల్లి తోటలో స్వామి వారి తిరునాళ్లకు వేలాదిగా భక్తులు తరలి వస్తున్నారన్నారు. భక్తులు జాగ్రత్తలు తీసుకొని ఉండాలని… జోబు దొంగలు ఇక్కడ ఎక్కువగా ఉన్నారు అని చెప్పారు. అనంతరం దేవాదాయ శాఖ ఈవో శ్రీనివాసరెడ్డి సీఐకి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.