విఐపి కల్చర్‌కు చెక్ చెప్పండి
జొన్నవాడ పరిసరాలలో మద్యం విక్రయాలను నియంత్రించండి..
సీసీ కెమరాల సంఖ్య పెంచి ఆకతాయిల ఆగడాలు అరికట్టండి..
కామాక్షితాయి బ్రహ్మోత్సవాలకు విపిఆర్ ఫౌండేషన్
ఆధ్వర్యంలో లైటింగ్, ప్రసాదాలు, తెప్పోత్సవ ఏర్పాట్లు..
రాజీపడొద్దు..నేనున్నా
- విఐపి కల్చర్‌కు చెక్ చెప్పండి
- జొన్నవాడ పరిసరాలలో మద్యం విక్రయాలను నియంత్రించండి..
- సీసీ కెమరాల సంఖ్య పెంచి ఆకతాయిల ఆగడాలు అరికట్టండి..
- కామాక్షితాయి బ్రహ్మోత్సవాలకు విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో లైటింగ్, ప్రసాదాలు, తెప్పోత్సవ ఏర్పాట్లు..
ఈనెల 17వ తేదీ నుంచి 27వ తేదీ వరకు జరిగే జొన్నవాడ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు విజయవంతం చేసేందుకు కృషి చేయాలని అధికారులు, ఆలయ సేవా కమిటీ సభ్యులు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కోరారు.. ఈ సందర్భంగా జొన్నవాడకు విచ్చేసిన ఎమ్మెల్యేకు ఆలయ అర్చకులు సేవా కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న ఆమె బ్రహ్మోత్సవాల సందర్భంగా చేయవలసిన ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.. పది రోజులపాటు అత్యంత వైభవంగా జరిగే అమ్మవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా వేలాదిగా హాజరయ్యే భక్తులకు సౌకర్యాలు కల్పించవలసిన బాధ్యత మనపై ఉందన్నారు.. అందరూ సమిష్టి కృషితో కష్టపడితేనే బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయగలమన్నారు.. పవర్ కట్ సమస్యలు తలెత్తకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు.. పోలీస్ రెవెన్యూ, ఎలక్ట్రిసిటీ ఫైర్, ఆర్టీసీ లాంటి ప్రధాన శాఖల మధ్య సమన్వయము చాలా అవసరం అన్నారు..భక్తుల సౌకర్యాల కల్పనలో ఎక్కడ రాజీ పడవద్దు అని సూచించారు..ఈ కార్యక్రమంలో ఆర్డీవో అనూష, ఆలయ ఈవో శ్రీనివాసులు రెడ్డి, సేవా కమిటీ సభ్యులు, వివిధ శాఖలకు చెందిన అధికారులు, టిడిపి నాయకులు ఉన్నారు.