దుస్థితిలో పోలీసు వాహనాలు
ఒరిగిపోతున్న సీటుకు కర్రసాయం చూడండి
కేసుల ఛేదనకు ఈ వాహనాలలో వెళ్లగలరా..?
ప్రోటోకాల్ డ్యూటీలకూ ఇవే..
ఎక్కడ మొరాయిస్తాయో కూడా తెలియని పరిస్థితి
జిల్లా ఎస్పీ గారూ.. ఓ లుక్కేయండి ఇటు..
ఇది.. మన పోలీస్ జీప్..!
దుస్థితిలో పోలీసు వాహనాలు
ఒరిగిపోతున్న సీటుకు కర్రసాయం చూడండి
కేసుల ఛేదనకు ఈ వాహనాలలో వెళ్లగలరా..?
ప్రోటోకాల్ డ్యూటీలకూ ఇవే..
ఎక్కడ మొరాయిస్తాయో కూడా తెలియని పరిస్థితి
జిల్లా ఎస్పీ గారూ.. ఓ లుక్కేయండి ఇటు..
అసలే నేరగాళ్లు మన నెల్లూరులో రెచ్చిపోతున్నారు.. హత్యలు, చోరీలు జరుగుతున్నాయి.. వీటిని నియంత్రించాలన్నా.. నేరస్తుల కదలికలను పసిగట్టాలన్నా.. నేరగాళ్ల ఆచూకీ కోసం ఎక్కడికైనా వెళ్లాలన్నా.. అర్థరాత్రి, అపరాత్రి గస్తీల్లో ఎవర్నైనా ఛేజ్ చేసి పట్టుకోవాలన్నా.. పోలీసులకు తప్పనిసరిగా కండీషన్‌లో ఉన్న వెహికల్స్ అవసరం. అవి కండీషన్‌లో లేకపోతే.. మాత్రం.. నేరాలను ఛేదించడంలో.. నేరగాళ్లకన్నా.. పోలీసులు వెనుకబడిపోవడం ఖాయం. నెల్లూరులో ప్రస్తుతం ఇదే జరుగుతుంది. పాతకాలపు జీపులు, వాహనాలతోనే పోలీసు స్టేషన్‌లలోని సీఐలు, ఎస్సైలు విధులు నిర్వర్తిస్తున్నారు. అవి ఎప్పుడో కాలం చెల్లాయి కూడా. పోలీసుల వాహనాలని.. ఆర్టీఏ అధికారులు కూడా వాటిని తనిఖీ చేయరు కాబట్టి సరిపోయింది. లేదంటే.. జిల్లాలోని సగం పోలీసు జీబులు షెడ్డులో ఉండాల్సినవే. అందుకు నెల్లూరు ఒకటో నగర పోలీసు స్టేషన్ జీపు దుస్థితి చూస్తేనే అర్థం అవుతోంది. ఆ జీపును పోలీసులు ఎలా వాడుతున్నారో అర్థం కాని పరిస్థితి. ఒరిగిపోతున్న సీటు పడిపోకుండా.. సపోర్టుకు ఓ కర్రను నిలబెట్టడం చూస్తుంటేనే పరిస్థితి అర్థం అవుతోంది. అంతేనా.. ఆ జీపులో ఏ పార్డు బాగుందో చెప్పండి.. తెగులొచ్చిన కోడిలా.. చెదలు పట్టిన ఇల్లులా ఉంది. ఇంత ఇబ్బందులు కష్టాలు పడుతూ.. ఆ పోలీసులు ఎలా ప్రయాణిస్తున్నారో.. ఎలా విధులు నిర్వర్తిస్తున్నరో.. రాత్రులు ఎలా గస్తీ నిర్వర్తిస్తున్నారో.. ప్రోటోకాల్ విధులు ఎలా నిర్వర్తిస్తున్నారో అర్థం కాని పరిస్థితి. ఆ జీపు అధ్వాన్న స్థితిలో.. శనివారం నెల్లూరు నగరంలోని వెంకటేశ్వరపురంలో మంత్రి నారాయణ పర్యటనకు వచ్చిన సందర్భంగా మంత్రి ప్రోటోకాల్ విధుల్లో భాగంగా సీఐ, ఎస్సై, సిబ్బంది ఆ జీపులో అవస్థలు పడుతూ.. వచ్చారు. ఈ వాహనం ఎన్-3 కెమెరాకు చిక్కడంతో ఈ దుస్థితిని వెలుగులోకి తెస్తున్నాం. సో.. జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ సార్.. ఓ సారి నెల్లూరు , రూరల్ డివిజన్‌లోని పోలీసు స్టేషన్‌లలోని వాహనాలను పరిశీలించి.. వాటి కండీషన్ ఎలా ఉందో.. తనిఖీలు చేయించి.. అవసరమైన చోట కొత్త వాహనాలను ఏర్పాటు చేయడమా..? లేక వాటిని పూర్తిస్థాయిలో మరమ్మత్తులు చేయించి.. కండీషన్‌లోకి తెచ్చేలా చర్యలు తీసుకోవడమా..? ఏదో ఒక చర్య తీసుకోవాలని పోలీసులందరి తరఫున ఎన్-3 కోరుతోంది.