స్వామి, అమ్మవార్లకు విశేష పూజలు
భక్తులకి అన్నదానం
వైభవంగా శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి
332వ వార్షిక ఆరాధన మహోత్సవం…
- స్వామి, అమ్మవార్లకు విశేష పూజలు
- భక్తులకి అన్నదానం
నెల్లూరు నగరం విరాట్ నగర్ లో వెలసి ఉన్న… శ్రీ గాయత్రీదేవి శ్రీ విశ్వకర్మ భగవాన్ స్వామి, శ్రీ గోవిందమాంబ సమేత జగద్గురు శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి 332వ వార్షిక ఆరాధన మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. పవిత్ర ఆరాధన మహోత్సవం సందర్భంగా… స్వామి, అమ్మవార్లకు సుప్రభాత సేవ, అభిషేకాలు, వివిష అలంకరణలు నిర్వహించారు. నెల్లూరు పట్టణ విశ్వ బ్రాహ్మణ సేవా సంఘం శాశ్వత వ్యవస్థాపకులు కందుకూరు చెంగయ్య ఆచారి ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు వార్షిక ఆరాధన మహోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు విశేషంగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించి తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు అన్నదానం చేశారు. అనంతరం ఆలయ అర్చకులు, కందుకూరు చెంగయ్య ఆచారి, కార్పొరేటర్ పోట్లూరి రామకృష్ణలు మీడియాతో మాట్లాడారు. పుర ప్రజలు, కమిటీ సభ్యులందరి సహకారంతోనే ప్రతీ ఏడాది ఆరాధన మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. సహకరిస్తున్న ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. కార్యక్రమంలో సేవా సంఘం సభ్యులు, ఆలయ పాలక మండలి సభ్యులు, భక్తులు, సిబ్బంది పాల్గొన్నారు.