నేటి వార్త మాలిక‌

క‌ల్తీ లేని వార్త‌లు క‌ల‌క‌లం రేపే క‌థ‌నాలు

అమ‌రావ‌తి రాజధానిలో వివిధ‌ సంస్థలకు భూ కేటాయింపులపై మంత్రి వర్గ ఉపసంఘం సమావేశమైంది. సెక్రటేరియట్ లోని త‌న ఛాంబర్ లో మంత్రి కొల్లుర‌వీంద్రతో పాటు ఉపసంఘం సభ్యులు, అధికారులతో మంత్రి నారాయ‌ణ స‌మావేశ‌మై.. ప‌లు అంశాల‌పై చ‌ర్చించారు.

కూటమి ప్రభుత్వం పాలనపై ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కుంభకోణాలు, స్కాంలు, మాఫియా, సిండికేట్లు రాజ్యమేలుతున్నాయని విమర్శించారు.

కావలిలో పైలాన్ ధ్వంసంపై తనపై నమోదైన కేసు పట్ల మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి స్పందించారు. బెంగుళూరు నుంచి మీడియా సమావేశంలో తన స్పందనను ఫోన్ ఆడియో ద్వారా తెలియజేశారు. తనపై నమోదైన అక్రమ కేసు వెనుక కావలిని కాపుకాచే నేత పనేనని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిని ఉద్దేశించి తెలిపారు.

ఇందుకూరుపేటలో రొయ్యల ప్రాసెసింగ్ ప్లాంట్ల నుంచి వచ్చే కెమికల్ వ్యర్ధాలతో తమ చెరువుల్లోని రొయ్యల మృత్యువాత పడుతున్నాయని గిరిజనులు లబోదిబోమంటున్నారు. అధికారులు వెంటనే స్పందించి రొయ్యల ప్రాసెసింగ్ ప్లాంట్లపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

52వ డివిజన్ పరిధిలోని రైలు వీధిలో సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్, నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు పర్యటించి బాధితులను పరామర్శించారు. స్థానికులు పలు సమస్యలను వారి దృష్టికి తీసుకువచ్చారు. నివాసితులకి నష్టపరిహారం, పునరావాసం కల్పించిన తరువాతే ఇళ్లను తొలగించాలని నేతలు హెచ్చరించారు.

కుటుంబ కలహాల కారణంగా బట్టా మనేయ్య అనే యువకుడు సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. విషయం తెలుసుకున్న వాకాడు పోలీసులు, అగ్నిమాపఖ శాఖ ఎస్ఐ తన సిబ్బందితో కలిసి అతనికి నచ్చజెప్పి కిందకు దించారు.

బుచ్చిరెడ్డిపాళెంలో డీసీఎంఎస్ మాజీ చైర్మన్ వీరి చలపతిరావు మీడియా సమావేశం నిర్వహించారు. కోవూరు నియోజకవర్గంలో ఇంచార్జులకు ఫుల్ చార్జ్…తమ్ముళ్ళకు డిశ్చార్జ్ పదవులు అని ఎద్దేవా చేశారు.

తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని రాపూరు ఆర్టీసీ డిపో సెక్రటరీ ఎన్వీ రమణయ్య డిమాండ్ చేశారు. ఆయన ఆర్టీసీ కార్మికులతో కలిసి స్థానిక తహసీల్దార్ లక్ష్మీ నరసింహకి వినతి పత్రం అందచేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ స్కీం ర‌చించినా దానివెనుక స్కాం త‌ప్పకుండా ఉంటుందని వైసీపీ నేతలు మందల వెంకట శేషయ్య, బొబ్బల శ్రీనివాసయాదవ్ లు ఆరోపించారు. నెల్లూరులోని వైసీపీ కార్యాలయంలో వారు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *