సీఎం చంద్రబాబు చేత ప్రశంసలు అందుకున్న రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి
నెల్లూరురూరల్లో చేపట్టిన 339 అభివృద్ధి పనులను సీఎంకి వివరించిన శ్రీధర్‌రెడ్డి
శెభాష్ కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి
- సీఎం చంద్రబాబు చేత ప్రశంసలు అందుకున్న రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి
- నెల్లూరురూరల్లో చేపట్టిన 339 అభివృద్ధి పనులను సీఎంకి వివరించిన శ్రీధర్‌రెడ్డి
నెల్లూరురూరల్ నియోజకవర్గ అభివృద్ధి, ప్రజాసంక్షేమం దిశగా నిరంతరం కృషి చేస్తున్న రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రత్యేకంగా అభినందించారు. అమరావతిలో సీఎం చంద్రబాబునాయుడును రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నెల్లూరురూరల్ నియోజకవర్గంలో చేపడుతున్న 339 అభివృద్ధి పనులను సీఎంకు ఎమ్మెల్యే వివరించారు. ఎక్కడ లేనివిధంగా అభివృద్ధి పనులను చేపట్టి అనుకున్న సమయానికి పూర్తి చేసి అన్నీంటిని ఒకేసారి మే 15వ తేదీన పెద్ద ఎత్తున ప్రారంభించి ప్రజలకు అంకితం చేసేలా ప్రణాళికలు చేసినట్లు సీఎం చంద్రబాబుకు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి వివరించారు. దీంతో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి పనితీరును అభినందిస్తూ ప్రసంశించారు.