తాగునీటి అవసరాల కోసం నీటి విడుదల
పెన్నా డెల్టాకు నీరు విడుదల
- తాగునీటి అవసరాల కోసం నీటి విడుదల
నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయం నుంచి 6వ క్రస్ట్ గేట్ ద్వారా పెన్నా డెల్టాకు వెయ్యి క్యూసెక్కుల నీటిని అధికారులు శుక్రవారం విడుదల చేశారు. తాగునీటి అవసరాల కోసం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నీటిని విడుదల చేసినట్లు జలాశయ అధికారులు తెలిపారు. సోమశిల జలాశయం పూర్తి సామర్థ్యం 78 టీఎంసీలు కాగా ప్రస్తుతం జలాశయంలో 51 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలాశయంలో 279 క్యూసెక్కుల నీరు ఆవిరి అవుతుంది.