కలువాయిలో ఘనంగా మేడే వేడుకలు
యూటీఎఫ్ కార్యాలయం వద్ద సీఐటీయూ జెండా ఆవిష్కరించిన నాయకులు, కార్మికులు
కార్మిక సంఘాలన్ని బలోపేతం చేయాలి…
- కలువాయిలో ఘనంగా మేడే వేడుకలు
- యూటీఎఫ్ కార్యాలయం వద్ద సీఐటీయూ జెండా ఆవిష్కరించిన నాయకులు, కార్మికులు
నెల్లూరు జిల్లా కలువాయిలోని సీఐటీయూ మండల కమిటీ ఆధ్వర్యంలో…మేడే వేడుకలను నాయకులు, కార్మికులు ఘనంగా జరుపుకున్నారు. యూటీఎఫ్ కార్యాలయం వద్ద సీఐటీయూ జెండాను కార్మికులు, నాయకులు ఆవిష్కరించారు. అనంతరం సిఐటియు మండల అధ్యక్షుడు ఓబులేసు మాట్లాడుతూ… మండలంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు అన్ని కూడా కలసివచ్చి సంఘాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం అంగన్వాడీ వర్కర్లు, ఆశలు, వివో ఏలు, సిఐటియు అనుబంధ సంఘాల కార్మికులు పాల్గొన్నారు