కలువాయిలో సూపర్ మార్కెట్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కురుగొండ్ల
ప్రజలకి అందుబాటులో M మార్ట్ సూపర్ మార్కెట్
- కలువాయిలో సూపర్ మార్కెట్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కురుగొండ్ల
నెల్లూరు జిల్లా కలువాయిలోని బస్టాండ్ సెంటర్ లో నూతనంగా M మార్ట్ సూపర్ మార్కెట్ ప్రారంభోత్సవం కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ విచ్చేశారు. ఆయనకి నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చేతుల మీదుగా సూపర్ మార్కెట్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే కురుగొండ్ల మాట్లాడుతూ…ఎం మార్ట్ సూపర్ మార్కెట్ ను ప్రజలందరికి అందుబాటులో ఉంచి తక్కువ ధరలకు సరుకులు అందించాలని కోరుకుంటున్నామన్నారు..అనంతరం కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కలువాయి మండల టౌన్ అధ్యక్షులు చిలకూరి ప్రసాద్ ని తన స్వగృహంలో కలసి పరామర్శించారు..