నేటి వార్త మాలిక‌

క‌ల్తీలేనివార్త‌లు క‌ల‌క‌లం రేపే క‌థ‌నాలు

దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అమరావతిని పున: ప్రారంభిస్తున్నామని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. మే 2న అమరావతికి ప్రధాని విచ్చేస్తున్నారన్నారు. ఈ మేరకు ఆయన అధికారులతో కలిసి ఏర్పాట్లు, సభా వేదిక, రోడ్డు మార్గాలను పరిశీలించి పలు సూచనలు, సలహాలు చేశారు.

మే 1న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆత్మకూరులో పర్యటించనున్నారు. సీఎం పర్యటించే ప్రాంతాలను జిల్లా కలెక్టర్‌ ఆనంద్‌, ఎస్పీ కృష్ణ కాంత్‌ పరిశీలించారు. పర్యటనలో ఎక్కడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తిచేయాలని అధికారులకు కలెక్టర్‌ దిశా నిర్దేశం చేశారు.

నెల్లూరు పెన్నానదిలో అర్ధరాత్రి జరుగుతున్న అక్రమ ఇసుక దోపిడీని స్థానికులు, యువకులు అడ్డుకున్నారు. సంబంధిత అధికారులకి సమాచారం ఇచ్చినా ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయారు. వెంటనే వారు నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన వెంటనే రంగ ప్రవేశం చేసి స్పాట్ లో అధికారులకి ఫోన్ చేసినా స్పందించకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు వచ్చే వరకు ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదని శ్రీనివాసులురెడ్డి భీష్మించి బైఠాయించారు

నెల్లూరు డీసీసీబీ చైర్మన్ గా మెట్టుకూరు ధనుంజయరెడ్డి నియమితులయ్యారు. అందరికి అదృష్టం రాదని..నాకొచ్చిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఎన్3 న్యూస్ తో ధనుంజయరెడ్డి ప్రత్యేకంగా మాట్లాడారు.

ముత్తుకూరు మండలం బలిజపాళెంలోని సచివాలయంలో బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కుట్టుమిషన్ శిక్షణా కార్యక్రమాన్ని మండల టీడీపీ నాయకులు, అధికారులు ప్రారంభించారు. మహిళలు ఆర్ధికంగా బలపడాలనే సంకల్పంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని టీడీపీ మండల కార్యదర్శి నీలం మల్లికార్జున యాదవ్ పేర్కొన్నారు.

మే 2న అమరావతికి దేశ ప్రధాని విచ్చేస్తున్నారని మంత్రి నారాయణ తెలిపారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై అమరావతిలోని సచివాలయంలో రాష్ట్ర మంత్రులు, అధికారులు సమావేశమయ్యారు. ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ప్రధాని పర్యటన విజయవంతం చేయాలని అధికారుల్ని ఆదేశించారు.

కోవూరులో మహిళా రౌడీ షీటర్ అనేక దారుణాలకు పాల్పడుతోందని, వెంటనే ఆమెపై ఎస్పీ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హై కోర్ట్ న్యాయవాది రాజారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన విజయవాడ గాంధీ నగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు.

నెల్లూరు డీసీసీబీ చైర్మన్ గా నియమితులైన మెట్టుకూరు ధనుంజయరెడ్డితో సోమశిల ప్రాజెక్ట్ చైర్మన్ వేలూరు కేశవ చౌదరి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ధనుంజయరెడ్డికి ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.

బుచ్చిరెడ్డిపాళెం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ శ్రీనివాసులు అధ్యక్షతన సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. గ్రామాల్లో ప్రజాప్రతినిధులకు తెలియకుండా పనులు చేపట్టడం ఏమిటనీ బుచ్చిరెడ్డిపాలెం మండలం పెనుబల్లి ఎంపీటీసి వినయ్ నారాయణ మినగల్లు సర్పంచ్ పూజిత అధికారులను ప్రశ్నించారు.

కోట మండలం శ్రీనివాసత్రం గ్రామం వద్ద టీఎన్టీయూసీ అధ్యక్షులు చంగల్ రాయులు ఆధ్వర్యంలో రైతులు, టీడీపీ నేతలు మీడియా సమాశం నిర్వహించారు. క్రిస్ సిటీ విషయంలో ఆయన ఓ క్లారిటీ ఇచ్చారు. రైతులకి అన్యాయం జరగలేదని…వారిని అధికారులెవరూ బెదిరించలేదని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *