నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎంపికలు
క్రికెట్‌లో సత్తాచాటిన దివ్యాంగ క్రీడాకారులు
అన్నీ రంగాల్లో దివ్యాంగులు రాణించాలని సూచించిన వక్తలు
subscribe for more videos
ap fiber channel #93
దివ్యాంగ క్రికెట్ క్రీడాకారుల టీమ్ ఎన్నిక
- నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎంపికలు
- సత్తాచాటిన దివ్యాంగ క్రీడాకారులు
- అన్నీ రంగాల్లో దివ్యాంగులు రాణించాలని సూచించిన వక్తలు
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ Differently Abled Cricket Committee, Differently Abled Council of Andhra Pradesh సంయుక్త ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నూతన దివ్యాంగుల క్రికెట్ క్రీడాకారుల ఎంపిక కార్యక్రమం జరిగింది. నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జిల్లా క్రికెట్ సంఘ కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, జనరల్ మేనేజర్ భానుప్రకాష్, Differently Abled Cricket Committee చైర్మన్ యడ్లపల్లి సూర్యనారాయణ ముఖ్య అతిదులుగా విచ్చేసి దివ్యాంగ క్రికెట్ క్రీడాకారులను వారి ప్రతిభ ఆధారంగా సెలెక్ట్ చేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ దివ్యాంగులు మొక్కువోని పట్టుదలతో క్రికెట్ లో రాణించడం అభినందనీయమని కొనియాడారు. దివ్యాంగులు పట్టుదలతో క్రికెట్ ఆడటం వారి ఆత్మస్టైర్యానికి నిదర్శనమన్నారు. క్రికెట్ విభాగంలో దివ్యాంగులను ప్రోత్సహిస్తున్న ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ APEX COUNCIL వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. దివ్యాంగుల క్రీడాభివృద్ధికి ACA ప్రోత్సహించడం శుభపరిణామమని, దీనిని క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం నాలుగు విభాగాల్లో నూతన కమిటీని ఎన్నిక చేశారు. ఫీజికల్ డిజేబిలిటీ నుండి P. మనోహర్, వీల్ చైర్ కేటగిరీ నుండి పెంచలయ్య, బ్లైండ్ కేటగిరీ నుండి శ్రీనివాసులు, డెఫ్ కేటగిరి నుండి సుబ్రహ్మణ్యం లను కన్వీనర్స్ గా నియమించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర దివ్యాంగుల క్రికెట్ సంఘ జాయింట్ సెక్రటరీ గండా కైలాష్ రెడ్డి, భారతీయ దివ్యాంగుల క్రికెట్ క్రీడాకారుడు D. అఖిల్ రెడ్డి తో పాటు వీల్ ఛైర్ క్రికెట్ క్రీడాకారులు కంబాపు పెంచలయ్య, సీహెచ్ బాబుయాదవ్, రంజీష్, డౌలాబాష, కమలాకర్, సుధీర్, సుబ్రమణ్యం, వెంకట్, బాబురావు, అరుణకుమారి, తదితరులు పాల్గొన్నారు.