మానవత్వం మంట కలిసి పోతున్న వైనం
ఆస్తికోసం కన్నతల్లిని చితక బాదుతున్న క్రూరమైన మృగం
తల్లి తలని పట్టుకొని గోడకేసి బాది నువ్వు చావు అంటున్న ప్రబుద్ధుడు
ఆయన ఓ పార్టీ ప్రతినిధి అంటూ గొప్పలు చెప్పుకుంటూ కన్నతల్లి విషయంలో కసాయి కొడుకు.
తల్లికి చిత్రహింసలు..
- మానవత్వం మంట కలిసి పోతున్న వైనం
- ఆస్తికోసం కన్నతల్లిని చితక బాదుతున్న క్రూరమైన మృగం
- తల్లి తలని పట్టుకొని గోడకేసి బాది నువ్వు చావు అంటున్న ప్రబుద్ధుడు
- ఆయన ఓ పార్టీ ప్రతినిధి అంటూ గొప్పలు చెప్పుకుంటూ కన్నతల్లి విషయంలో కసాయి కొడుకు..
అమ్మ అని రెండు అక్షరాలు మన మరణం వరకు శాశ్వతంగా గుర్తు ఉండిపోవాలి. అమ్మ అనే పిలుపులో ఉండే తియ్యదనం అమ్మ అంటేనే దైవంతో సమానం అమ్మ మనలను 9 నెలలు పాటు తన చల్లని కడుపులో మోసి కష్టమైన నొప్పులు భరించి మనల్ని భూమి మీదకు చేర్చి అమ్మ మనకు కలియుగం చూపి మనం పెద్దయ్యేదాకా లాలించి ఆడించి మోసి ఎత్తుకొని పెంచి పెద్ద చేసి తాను కడుపు మార్చుకుని తన బిడ్డలకు కడుపు నింపి తనకు ఆకలిగా ఉన్న తన బిడ్డల దగ్గర ఆకలి లేదు అని నటిస్తూ…. నిజమైన ప్రేమను తన బిడ్డలకు పంచుతూ తన బిడ్డలకు చక్కని బట్టలు తొడిగి తాను మాత్రం తిరిగిన బట్టలు వేసుకొని ఆనందించే ఒకే ఒక్క దేవత మన అమ్మ.. మనకు బాధ కలిగితే మొట్టమొదటి మనం అనే మాట అమ్మ అని…. మనకు ప్రమాదం ఏదైనా జరిగితే మొదటిగా బాధపడేది మొదట ఏడ్చేది ఒకే ఒక్కరు మన అమ్మ. మన అమ్మను మనం ఎంత గొప్పగా చూసుకుంటే దేవుడు మనకు అంత గొప్పగా సహాయం చేస్తాడు అన్నది అక్షర సత్యం. కొంతమంది అమ్మలేని వారు అమ్మ కోసం పరితపిస్తారు… అమ్మ ప్రేమ కావాలని అల్లాడిపోతుంటారు… కొంతమంది ఆ భగవంతుడు అమ్మ రూపంలో వరం అందించిన ఆ వరాన్ని తీసుకోకుండా దైవం లాంటి అమ్మను నానా రకాలుగా హింసలు పెడుతూ పైసాచికంగా ఆనందపడుతారు….ఇదంతా ఎందుకు చెబుతున్నామని అనుకుంటున్నారా….వాచ ద ఎన్ 3 న్యూస్….
నవ మాసాలు మోసి జన్మనిచ్చిన ఆ తల్లిని తనయుడు చిత్రహింసలకు గురిచేసిన ఘటన తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలోని సూళ్లూరు ప్రాంతంలో ఆలస్యంగా వెలుగు చూసింది. సూళ్లూరు ప్రాంతానికి చెందిన కొప్పోలు రామారావు అనే వ్యక్తి ఓ పార్టీ ప్రతినిధి అంటూ గొప్ప చెప్పుకుంటూ కన్నతల్లి విషయంలో క్రూరంగా మారాడు. కన్నతల్లిని క్షత్రియులు నిత్యం తీవ్రస్థాయిలో దాడులు దుర్భాషలు కనీస మానవత్వం లేకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోవాలంటూ బెదిరింపులు.. ఈ వేదింప దృశ్యాలని సెల్ ఫోన్ చిత్రీకరించిన స్థానికులు. అతన్ని పోలీస్ స్టేషన్ కు పిలిచి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు. ఇప్పటికైనా తన పద్దతి మార్చుకొని కన్నతల్లిని బాగా చూసుకోవాలని పలువురు కోరుతున్నారు.